సాయిబాబా గుడి వద్ద నిరుద్యోగుల ధర్నా

సాయిబాబా గుడి వద్ద నిరుద్యోగుల ధర్నా

ఎల్బీనగర్:

దిల్‌సుఖ్‌నగర్‌లోని సాయిబాబా ఆలయం వద్ద పోలీస్ ఉద్యోగాల భర్తీ, వయోపరిమితి సడలింపుల అంశంపై నిరుద్యోగ యువత ఆందోళనకు దిగింది. పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల సంఖ్యను పెంచాలని,వయో పరిమితిపై ప్రభుత్వం వెంటనే స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు, నిరుద్యోగ అభ్యర్థుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దిల్‌సుఖ్‌నగర్‌లోని సాయిబాబా ఆలయం వద్ద నిరుద్యోగ యువత చేపట్టిన ధర్నా ఉద్రిక్తంగా మారింది. 
పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల సంఖ్యను 5 వేల నుంచి కనీసం 20 వేల వరకు పెంచాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు నిరసన వ్యక్తం చేశారు.పోలీస్ నియామకాలలో వయోపరిమితి అంశంపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో సుమారు 45 వేల పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, ప్రస్తుత ప్రభుత్వం కేవలం 5 వేల పోస్టుల భర్తీ గురించే మాట్లాడుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.అలాగే గతంలో అమల్లో ఉన్న వయోపరిమితి సడలింపులను ఇప్పుడు ఎందుకు తగ్గించారని ప్రశ్నించారు. నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని, పోలీస్ శాఖలో భారీ స్థాయిలో ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.ధర్నా సందర్భంగా పోలీసులు ఆందోళనకారులను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు, నిరుద్యోగ అభ్యర్థుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా, పరిస్థితి స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది.ప్రభుత్వం వెంటనే స్పందించి పోలీస్ నియామకాలపై స్పష్టత ఇవ్వాలని, ఉద్యోగాల సంఖ్య పెంచడంతో పాటు ఏజ్ లిమిట్ సడలింపులు కొనసాగించాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.WhatsApp Image 2026-06-12 at 19.11.35

About The Author