*ఎఫ్-లైన్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి

  • *గడువు దాటిన వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
  •  *అధికారుల సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రా రెడ్డి ఆదేశం

*ఎఫ్-లైన్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి

రంగారెడ్డి జిల్లా:

రంగారెడ్డి జిల్లాలో ఎఫ్-లైన్‌కు సంబంధించిన పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) చంద్రా రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సహాయ సంచాలకుల (ఏడీ, ఎస్‌ఎల్‌ఆర్) ఆధ్వర్యంలో జిల్లాలోని మండల సర్వేయర్లు, డీఐఓఎస్‌లతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

*గడువు దాటిన దరఖాస్తులపై సీరియస్
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. సేవా హామీ చట్టం (SLA) గడువు ముగిసిన ఎఫ్-లైన్ దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత సర్వేయర్లను ఆదేశించారు. మండలాల వారీగా పెండింగ్ దరఖాస్తుల స్థితిగతులను ఆయన కూలంకషంగా సమీక్షించారు. ముఖ్యంగా సేవా హామీ చట్టం గడువు దాటిన 'కేటగిరీ-బి' దరఖాస్తులపై ప్రత్యేకంగా చర్చించారు. తదుపరి సమీక్షా సమావేశం నాటికి ఈ పెండింగ్ దరఖాస్తులన్నింటినీ సత్వరమే పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన గడువు విధించారు.

*పారదర్శకతతో కూడిన సేవలు అందించాలి
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని చంద్రా రెడ్డి సూచించారు. ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేదా అవినీతి ఆరోపణలకు తావు లేకుండా పూర్తి పారదర్శకతతో పని చేయాలన్నారు. దరఖాస్తుల పరిష్కార ప్రక్రియలో వేగం, నాణ్యత, పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, ప్రభుత్వ సేవలను సకాలంలో ప్రజలకు అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఈ సమీక్షా సమావేశంలో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సహాయ సంచాలకులు రాంరెడ్డి, జిల్లాలోని మండల సర్వేయర్లు, డీఐఓఎస్‌లు, ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

About The Author