*హకీంపేట హెచ్‌ఎండీఏ భూముల ఈ-వేలం వాయిదా
*వచ్చే నెల 2న ఆన్‌లైన్ వేలం.. 19న ప్రీ-బిడ్ సమావేశం
హైదరాబాద్:
పరిపాలనాపరమైన కారణాల వల్ల ఈ ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. షేక్‌పేట మండలం హకీంపేట్ గ్రామంలోని సర్వే నంబరు 102/1 (టి.ఎస్. నంబర్ 1/పి, 3/పి) లో గల 8.24 గుంటల స్థలాన్ని విక్రయించేందుకు గతంలో హెచ్‌ఎండీఏ నోటిఫికేషన్ జారీ చేసింది. అత్యంత విలువైన ఈ స్థలానికి రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో భారీ డిమాండ్ ఉంది.
ముందుగా ప్రకటించిన గడువు స్థానంలో మార్పులు చేస్తూ హెచ్‌ఎండీఏ కొత్త షెడ్యూల్‌ను ఖరారు చేసింది. దీని ప్రకారం.. ఈ నెల 12న జరగాల్సిన ప్రీ-బిడ్ (సన్నాహక) సమావేశాన్ని జూన్ 19న నిర్వహించనున్నారు. అలాగే జూన్ 19న జరగాల్సిన ఈ-వేలం (ఆన్‌లైన్ వేలం) ప్రక్రియను జూలై 2వ తేదీకి వాయిదా వేశారు. వేలంలో పాల్గొనదలచిన కొనుగోలుదారులు, వివిధ సంస్థల ప్రతినిధులు మారిన తేదీలను గమనించి, అందుకు అనుగుణంగా సిద్ధం కావాలని అధికారులు ఆ ప్రకటనలో సూచించారు.
