లోకల్ ఎస్సై..లోకల్ పోస్టింగ్

  • వైన్స్ ల నుంచి  జోరుగా ఎస్సై వసూళ్లు
  • సివిల్ తగదాల్లో విపరీతమైన జోక్యం..రెండు వర్గాల నుంచి వసూళ్లు
  • ఊరికో ఏజెంట్..వాళ్ల ద్వారే సెటిల్ మెంట్స్
  • బాస్ వారించినా..డోంట్ కేర్ అంటూ వ్యవహారం
  • ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు సహాకారం
  • వివాదస్పదంగా మారుతున్న వేములవాడ సబ్ డివిజన్ ఎస్సై

రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ సబ్ డివిజన్ లోని ఓ ఎస్సై వ్యవహారం రోజురోజుకు వివాదస్పదమవుతోంది. వేములవాడ నియోజకవర్గంలోని ఓ గ్రామానికి చెందిన సదురు ఎస్సై, ప్రస్తుతం అదే వేములవాడ సబ్ డివిజన్ లో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధమైనప్పటికీ, ఉన్నతాధికారులు ఎస్సైకి ఓ రూరల్ పోలీసు స్టేషన్ కు ఎస్ హెచ్ ఓగా పోస్టింగ్ ఇవ్వడం ప్రస్తుతం చర్చనీయంశాంగా మారింది.  ఇదే అవకాశంగా మల్చుకున్న ఎస్సై, లోకల్ ఎస్సైగా చెలామణి అవుతూ,  అన్నింటిల్లో చేతులు చాచుతున్నట్లు బాధితులు ఆధారాలు చూపుతున్నారు. స్టేషన్ కు వెళ్లే ఎలాంటి ఫిర్యాదులోనైనా సరే, తనకంటూ ప్రత్యేక రేటును నిర్ణయించుకుని, మధ్యవర్తుల ద్వారా ఎస్సై దండుకుంటున్నట్లు బహాటంగా చెబుతున్నారు. ఎస్సై అవినీతి ఆరోపణలు విపరతీమవుతుండటంతో, యూనిట్ బాస్ ఎన్నిసార్లు హెచ్చరించానా, అతని మార్పు రాకపోవడం పోలీసుశాఖకే మాయనిమచ్చలా మారింది.  రాజకీయ అండదండలతో కొనసాగుతున్న ఎస్సై, పోలీసుశాఖ పరువును బజారునపడేస్తున్నట్లు రాజన్న సిరిసిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

వైన్స్ ను వదలని ఎస్సై..

వైన్ షాపుల నుంచి ప్రతినెలా మాముళ్లు ఎస్సై క్రమ తప్పకుండా వెళ్తున్నట్లు ఫిర్యాదులు వెళ్లాయి. ప్రతినెలా ఒక్కో వైన్స్ రూ. 10 నుంచి ఇరవై వేల వరకు ఎస్సైకి వైన్స్ నిర్వహకులు అందజేస్తున్నారు.   లేదంటే వైన్స్ షాపు నిర్వహకులను పలు రకాలుగా ఎస్సై వేధిస్తున్నట్లు సమాచారం. తనకు వచ్చే మాముళ్లలోనూ వాటాలు తప్పవని పలుమార్లు ఎస్సై కస్సుబుస్సుమన్నట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.

ఎస్సైకి,  ఊరికో మధ్యవర్తి..

పోలీసు స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాల నుంచి ఎస్సైకి మధ్యవర్తి ఉన్నట్లు స్టేషన్ సిబ్బంది బహాటంగా చెప్పడం విశేషం. ఏదైనా గ్రామం నుంచి పోలీసు స్టేషన్ కు ఫిర్యాదు వస్తే, వెంటనే ఎస్సై తనకున్న మధ్యవర్థులకు ఫోన్ చేసి,  ఫిర్యాదు వెనుకున్న విషయం ఏంటో తెలుసుకుని, ఎవరి నుంచి ఎంత తీసుకోవాలో మధ్యవర్తికి చెప్పడంతో, సదురు మధ్యవర్తులు రంగంలోకి దిగి, స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదుపై ఎఫ్ ఐఆర్ లు అవకుండా రాజీకుదురుస్తున్నట్లు పోలీసు అధికారులు గుర్తించారు.  ఆలా రాజీ చేసిన ఫిర్యాదుల వెనుక వేల రూపాయలు చేతులు మారుతున్నట్లు  బాధితులు చెబుతున్నారు.  అంతేకాదు సివిల్ పంచాయితీ అంటే చాలు, ఎస్సైకి పండగే అన్నట్లుగా చెప్పుకుంటున్నారు.  నోటిమాటతో ఇరు వర్గాలను బెదిరించి, వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు చెబుతున్నారు.  అంతేకాదు ప్రజాప్రతినిధుల పైరవీలకు పోలీసు స్టేషన్ అడ్డాగా మారిందనే ఫిర్యాదులు ఉన్నాయి.  వసూళ్లలో అంతా తనకే అన్నట్లుగా ఎస్సై జేబులో వేసుకోవడంపై సర్వత్రా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

...........................

ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు అండగా ఎస్సై..

చేసే ఉద్యోగం ఎస్సై అయినప్పటికీ, సదురు ఎస్సై లోకల్ కావడంతో, ఉద్యోగ బాధ్యతకంటే ఎక్కువగా రాజకీయాల గురించి ప్రస్తావించడం ఎస్సైకి కామన్ గా మారిందని అంటున్నారు. ఇటీవల జరిగిన వేములవాడ మున్సిపల్ ఎన్నికల్లో, ఏకంగా ఎస్సై బీఆర్ ఎస్ పార్టీ నుంచి ఓ అభ్యర్థిని నిలబెట్టి, ఆ అభ్యర్థికి ఎలక్ష్ ఫండింగ్ కూడా చేయడమే కాకుండా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా  ప్రచారం చేయడంలో సదురు బీఆర్ ఎస్ కౌన్సిలర్ అభ్యర్థిని ప్రోత్సహించినట్లు పొలిటికల్ సర్కిళ్లలో జోరుగా ఎస్సై పాత్రపై చర్చించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను సైతం పలువురు చూపడం విశేషం.  అనేక వివాదస్పదాలకు, ఆరోపణలకు కారణమవుతూ,  భారీగా దండుకుంటూ పోలీసుశాఖ పరువుతీస్తున్న ఎస్సై చర్యలు తీసుకోవడంలో పోలీసు ఉన్నతాధికారులు ఎందుకు వెనుకడుగు వేసుకుంటున్నారో అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికైనా రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ విచారణ చేపట్టి, సదురు ఎస్సైపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.

About The Author