60 లక్షల సుపారితో న్యాయవాది మల్లారెడ్డి మర్డర్

ములుగు బ్యూరో, ఆగస్టు 04 (భారత శక్తి): న్యాయవాది మూలగుండ్ల మల్లారెడ్డి హత్య కేసు ఓ వ్యూహాత్మక మలుపు తిరిగింది. మొదట పోలీసులు చేసిన అనుమానం తలకిందులై కొత్తవిషయాలు వెలుగులోకి వచ్చాయి.నర్సంపేట ప్రాంతంలోని ఎర్రమట్టి క్వారీ,రైసుమిల్లు,అలాగే పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నా ఓ వ్యాపారి, ఇద్దరు మాజీ ప్రజప్రతినిధులు,నల్లబెల్లి మండలానికి చెందిన ఓ విలేకరి లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా, నర్సంపేటకు చెందిన వ్యాపారి ఈ హత్యపథక రచన చేసినట్లు గుర్తించారు.న్యాయవాది మల్లారెడ్డితో సదరు వ్యాపారి,ములుగు మండలానికి చెందిన ఇద్దరు మాజీ ప్రజాప్రతినిధులకు గత ఏడాది క్రితం, భూమికి సంబంధించిన వివాదం జరిగింది. అందులో ఆ విలేకరి కీలకపాత్ర పోషించారని,ఆ సమస్య ఇప్పటికీ ఉందని చెబుతున్నారు. ఏడాది కిందనే వరంగల్ లోని ఒక హోటల్ లో వీరంతా సమావేశమై న్యాయవాది హత్యకు వ్యూహారచన చేశారని, విశ్వవసనీయ సమాచారం ప్రకారం రూ: 60 లక్షల ఒప్పందంతో మల్లారెడ్డి మర్డర్ కుట్రను అమలు చేసే బాధ్యత నల్లబెల్లీ కి చెందిన విలేకరి తీసుకున్నాడు. అందులో భాగంగానే కర్నూలు జిల్లాకు చెందిన ముగ్గురిని, నల్లబెల్లి మండలంలోని ముంచింపుల నుండి ఒకరిని, బోళ్ళోనిపల్లి నుండి మరొకరు;నర్సంపేట గ్రామానికి చెందిన ఒకరితో పాటు మరో ఇద్దిరితో కలిసి మొత్తం 8 మందిని మూడు బృందాలుగా ఎర్పడి,అనుకున్న ప్రకారం పందికుంట బస్ స్టేజీ సమీపంలోని చెట్లపొదల్లోకి లాక్కెళ్లి కత్తులతో పొడిచి హత్య చేశారు. అనంతరం నల్లబెల్లి మండలం ముచింపుల గ్రామ పరిధిలో మద్యం తో పార్టీ చేసుకుని అర్థరాత్రి దాటాక ఎక్కడివారక్కడికి వెళ్ళిపోయారని సమాచారం.

60 లక్షల సుపారితో న్యాయవాది మల్లారెడ్డి మర్డర్

ములుగు బ్యూరో, ఆగస్టు 04 (భారత శక్తి): న్యాయవాది మూలగుండ్ల మల్లారెడ్డి హత్య కేసు ఓ వ్యూహాత్మక మలుపు తిరిగింది. మొదట పోలీసులు చేసిన అనుమానం తలకిందులై కొత్తవిషయాలు వెలుగులోకి వచ్చాయి.నర్సంపేట ప్రాంతంలోని ఎర్రమట్టి క్వారీ,రైసుమిల్లు,అలాగే పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నా ఓ వ్యాపారి, ఇద్దరు మాజీ ప్రజప్రతినిధులు,నల్లబెల్లి మండలానికి చెందిన ఓ విలేకరి లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా, నర్సంపేటకు చెందిన వ్యాపారి ఈ హత్యపథక రచన చేసినట్లు గుర్తించారు.న్యాయవాది మల్లారెడ్డితో సదరు వ్యాపారి,ములుగు మండలానికి చెందిన ఇద్దరు మాజీ ప్రజాప్రతినిధులకు గత ఏడాది క్రితం, భూమికి సంబంధించిన వివాదం జరిగింది. అందులో ఆ విలేకరి కీలకపాత్ర పోషించారని,ఆ సమస్య ఇప్పటికీ ఉందని చెబుతున్నారు.

ఏడాది కిందనే వరంగల్ లోని ఒక హోటల్ లో వీరంతా సమావేశమై న్యాయవాది హత్యకు వ్యూహారచన చేశారని, విశ్వవసనీయ సమాచారం ప్రకారం రూ: 60 లక్షల ఒప్పందంతో మల్లారెడ్డి మర్డర్ కుట్రను అమలు చేసే బాధ్యత నల్లబెల్లీ కి చెందిన విలేకరి తీసుకున్నాడు. అందులో భాగంగానే కర్నూలు జిల్లాకు చెందిన ముగ్గురిని,
నల్లబెల్లి మండలంలోని ముంచింపుల నుండి ఒకరిని, బోళ్ళోనిపల్లి నుండి మరొకరు;నర్సంపేట గ్రామానికి చెందిన ఒకరితో పాటు మరో ఇద్దిరితో కలిసి
మొత్తం 8 మందిని మూడు బృందాలుగా ఎర్పడి,అనుకున్న ప్రకారం పందికుంట బస్ స్టేజీ సమీపంలోని చెట్లపొదల్లోకి లాక్కెళ్లి కత్తులతో పొడిచి హత్య చేశారు. అనంతరం నల్లబెల్లి మండలం ముచింపుల గ్రామ పరిధిలో మద్యం తో పార్టీ చేసుకుని అర్థరాత్రి దాటాక ఎక్కడివారక్కడికి వెళ్ళిపోయారని సమాచారం.

About The Author

Related Posts