FORUM FOR ANTY CORRUPTION AND HUMAN RIGHTS

మీరు భయపడ్డారా.. అంతే సంగతులు...

రోజు రోజుకూ పెరిగిపోతున్న సైబర్ నేరాలు..  యువత, వృద్దులు, మహిళలే టార్గెట్..  రక రకాల పేర్లతో ఏమారుస్తారు..  లేని సుఖం కోసం అర్రులు చాచే వాళ్ళు వీరి వలలో చిక్కుకుంటారు..  ముఖ్యంగా ప్రభుత్వ పథకాల ఆశచూపి మోసం చేస్తారు..  కొత్తగా డిజిటల్ అరెస్ట్ అనే కొత్త పంథాను అనుసరిస్తున్నారు..  నిరుద్యోగం, ఆర్ధిక అసమానతలు ఈ నేరాలకు పురిగొల్పుతున్నాయి..  ఒక్కసారి వీరి వలలో చిక్కుకున్నారా ఇక బయటకు రాలేరు..  కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే తప్పించుకోవచ్చు..  ఎలాంటి అనుమానం వచ్చినా పోలీసులను సంప్రదించండి..  ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ వారు అందిస్తున్న ప్రత్యేక కథనం..  ఈజీ మనీ.. సులువుగా డబ్బు సంపాదించాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరిలోనూ పెరిగిపోతోంది.. ఎలాంటి కష్టం చేయకుండానే చేతిలో డబ్బులు వచ్చి పడాలి అనుకుంటారు.. ఇలాంటి వారినే టార్గెట్ చేస్తుంటారు సైబర్ నేరగాళ్లు.. మీకు ఎదో రకంగా ఆశ చూపిస్తారు.. తమ పరిధిలోకి మిమ్మల్ని తీసుకుంటారు.. తొలుత ఫ్రీగా కొన్ని ప్రయోజనాలు మీకు అందేలా చేస్తారు.. ఇక మీ జీవితాలతో ఆడుకుంటారు ఇది ఒక రకం..  ఇక రెండవది భయం.. ప్రతి చిన్న విషయానికీ భయపడే వారిని వీరు టార్గెట్ చేస్తారు.. మీలో ఉన్న భయం ఆధారంగా మిమ్మల్ని  మేనిప్లేట్ చేస్తారు.. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, టీనేజ్ వాళ్ళు వీరి వలలో చిక్కుకుంటారు.. అలాంటి వారిని చాలా ఈజీగా మోసం చేసేస్తారు..  ఇక మూడవరకం ఊహకు అందని అనుభవాలను కోరుకునే వారు ఉంటారు.. వీరిలో కాలేజీ స్థాయి విద్యార్థులు, పెళ్ళైన మహిళలు, ఒంటరిగా జీవిస్తున్నవారు.. వీరికి ఎన్నెన్నో మాయ మాటలు చెబుతారు.. ఆనందం మీవెంటే ఉంటుందని ఊరిస్తారు..  సుఖాలు అనుభవించవచ్చు అని ఆశలు రేకెత్తిస్తారు.. ఇలాంటి వారిని కూడా తమ అదుపులోకి తీసుకుంటారు సైబర్ నేరగాళ్లు  తమ ఇష్టానుసారం ఆడిస్తారు.. దోచుకుంటారు.. కనుక వాస్తవంలో జీవించడం అలవరచుకోవాలి.. అదుపులేని కోరికలను అదుపు చేసుకోవాలి..  కష్టపడి సంపాదించడం నేర్చుకోవాలి.. ఏ అవసరం ఉన్నా పోలీసుల సహాయం తీసుకోవాలి.. అప్పుడే సైబర్ నేరగాళ్ళను కట్టడి చేయవచ్చు..  
తెలంగాణ  క్రైమ్ 
Read More...