ganesh mandapaalu

గణేశ మండపాలా.. గల్లీలను మూసేసే అవరోధాలా..?

భక్తి ఉన్మాదంగా మారితే భయంకర పరిస్థితులు నెలకొంటాయి..  మంటపాల పేరుతో రోడ్లను ఆక్రమిస్తే జనజీవనం అస్తవ్యస్తమౌతుంది..  వాహనదారులకు, పాదచారులకు తీరని అసౌకర్యం కలుగుతుంది.. దేవుడి పేరుతో చేస్తున్న దౌర్జన్యకాండలకు అంతం లేదా..?  ఇతరులకు ఇబ్బంది కలిగిస్తూ పూజలు చేస్తే పుణ్యం వస్తుందా..?  చెవులు చిల్లులు పడే డీజేలు.. తాగి తందనాలు ఇదేనా దేవుడి సేవ..? ఉత్సవాలు చేసుకోవద్దని ఎవరూ చెప్పడం లేదు.. ఒక పద్దతిగా ఉండాలన్నదే చర్చ..  హంగు, ఆర్భాటాలు ఆ విగ్నేశ్వరుడికి నచ్చుతాయా..? వరాలు కురిపిస్తాడా..?  బలవంతపు చందాలు వసూలు చేసి, మండపాలు కడితే ముక్తి లభిస్తుందా..? ఇదేమి భక్తి.. ఇదేమి పద్ధతి..? అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్న మేధావులు.. ప్రభుత్వం దృష్టిపెట్టి ఈ పద్దతికి చరమ గీతం పాడాలి..  శాంతియుత వాతావరణంలో గణేశ నవరాత్రులు జరగాలి..  ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ అందిస్తున్న ప్రత్యేక కథనం..  భక్తి అనేది పవిత్రం ఉండాలి.. మనసులో ఉండాలి.. పారవశ్యంతో మైమరచిపోవాలి.. అంతేగానీ ఆర్భాటాలకు పోయి, ఒకరిని మించి ఒకరు భారీ ఎత్తున ఖర్చుపెడుతూ, పెద్ద పెద్ద మండపాలు కడుతూ.. భక్తిని ప్రదర్శించడం ఎంతవరకు భావ్యం.. దానికోసం అయ్యే ఖర్చును బలవంతంగా చందాల రూపాన వసూలు చేయడం మరొక దుర్మార్గపు చర్య.. రోడ్డు మధ్యలో మండపాలు నిర్మిస్తూ.. విద్యుత్ దీపాలతో అలంకరిస్తూ..  డీజే సౌండ్లతో అందరినీ ఇబ్బంది పెడుతూ గణేశ నవరాత్రులు జరుపుకోవడం ఎంతవరకు కరెక్ట్.. వీరు చేస్తున్న హంగామా వల్ల  ఎంతమందికి ఇబ్బందులు ఎదురవుతున్నాయో ఒక్కసారైనా ఆలోచించారా..? ట్రాఫిక్ జాన్స్, యాక్సిడెంట్స్, క్యారెట్ షాకులు ఏర్పడటం..  ఎంత ప్రాణనష్టం జరుగుతుందో తెలుస్తోందా..? అసలు ఎందుకీ ఉన్మాదం..? ఒక్కసారి అందరూ.. ముఖ్యంగా యువత ఆలోచించాలని  విజ్ఞప్తి చేస్తోంది " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ ".. 
తెలంగాణ  ఆధ్యాత్మికం 
Read More...