ఘనంగా శ్రీ సరస్వతి శిశు మందిర్ వార్షికోత్సవ వేడుకలు

  • * శిశు మందిర్ లో చదువుతో పాటు సంస్కారం, సంస్కృతి, దేశభక్తిని బోధిస్తాం 
  • * మన దేశ సంస్కృతి సంప్రదాయలను నేర్పించే ఏకైక పాఠశాల డాక్టర్ నరేష్ బాబు

ఘనంగా శ్రీ సరస్వతి శిశు మందిర్ వార్షికోత్సవ వేడుకలు

గజ్వేల్:

 సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని శ్రీ సరస్వతి శిశుమందిర్ స్కూల్ వార్షికోత్సవం, పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధానోపాధ్యాయురాలు హరిణా పవన్ వ్యాఖ్యత గా వ్యవహరించారు, ఈ కార్యమానికి విశిష్ట అతిధిగా విచ్చేసిన సామాజిక సమరసతా వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నరేష్ బాబు మాట్లాడుతూ శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో చదువుతో పాటు సంస్కారం, సంస్కృతి, దేశభక్తిని బోధిస్తారని, మన దేశ సంస్కృతి సంప్రదాయలను నేర్పించే ఏకైక పాఠశాల శ్రీ సరస్వతి శిశు మందిర్ అని, పేర్కొన్నారు, దేశానికి ఎందరినో డాక్టర్ లను, శాస్త్రవేత్తలను, మహానుభావులను అందించిన ఘనత శ్రీ శిశు మందిర్ పాఠశాల కె దక్కిందని కొనియాడారు, ఈ వేడుకలలో చిన్నారుల సంప్రదాయ నృత్యాలు ప్రేక్షకులను అలరించాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, స్కూల్ విద్యార్థి, విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, గజ్వేల్ పట్టణ ప్రముఖులు హాజరయ్యారు.WhatsApp Image 2026-04-21 at 19.00.28

About The Author