న్యూసెన్స్ చేస్తే సిటీ పోలీస్ యాక్ట్ కింద కేసులు నమోదు
- చోరీ కేసులు ఛేదించేందుకు ప్రతేక పోలీస్ బృందాలు...
- గంజాయి సరఫరా, వినియోగన్ని సమూలంగా నియంత్రించేందుకు పటిష్టమైన చర్యలు
- రెండు నెలల్లో 114 గంజాయి బ్యాచ్ అరెస్టు, పలు కేసుల్లో 11 లక్షల విలువ చేసే గంజాయి స్వాధీనం
- టౌన్ ఏసీపీ రమణమూర్తి

ఖమ్మం ప్రతినిది (భారత శక్తి న్యూస్ ), ఆగష్టు 19::
పబ్లిక్ న్యూసెన్స్ చేస్తే సిటీ పోలీసు యాక్టు కింద కేసులు నమోదు చేస్తామని టౌన్ ఏసీపీ రమణమూర్తి తెలిపారు.
చోరీ కేసులను చేదించేందుకు మూడు పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు వేగవంతం చేసినట్లు టౌన్ ఏసీపీరమణమూర్తి తెలిపారు. చోరీ సంఘటనా స్థలంలో లభించిన ఆధారాల మేరకు త్వరితగతిన కేసు ఛేదించేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేసినట్లు తెలిపారు.త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పేర్కొన్నారు.
నగరంలోని పలు ప్రాంతాలలో రికార్డు అయిన సిసి కెమెరాల పుటేజ్ ఆధారంగా అనుమానిత వ్యక్తుల వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు.
About The Author
17 Jun 2026
