విదేశాల్లో బందీ అవుతున్న భారతీయ మేధస్సు..

- అంధకారంగా విదేశాల్లో భారతీయ విద్యార్థుల భవితవ్యం.. 
- ఇక్కడ విద్యాబుద్ధులు నేర్చుకుని ఫారిన్ వెళ్లిపోతున్న యువత..
- అధిక సంపాదన కోసం కన్నభూమికి ద్రోహం అంటున్న విశ్లేషకులు.. 
- ఇక్కడ అవకాశాలు లేవు అందుకే వెళ్తున్నారంటున్న మేధావులు.. 
- ప్రమాదకర పరిస్థితుల్లో విదేశాల్లో నివసిస్తున్నారు.. 
- ఎప్పుడు, ఏవైపు నుంచి గన్ పేలుతుందో..? ప్రాణాలు ఎప్పుడు పోతాయో తెలియని పరిస్థితి.. 
- విదేశాల్లో ఉన్నారని తల్లిదండ్రులు చెప్పుకోవడం తప్ప ఒరిగేది ఏమీ లేదు.. 
- తల్లి దండ్రుల అంత్యక్రియలు కూడా వీడియో కాల్ లో చూడాల్సిన దుర్భర స్థితి.. 
- ప్రభుత్వం కళ్లుతెరిస్తే తప్ప సమస్యకు పరిష్కారం దొరకదు.. 
- వారికి తగిన ప్రోత్సాహం, వేతనం ఇవ్వగలిగితే ఎందుకు ఫారిన్ ను ఎంచుకుంటారు.. 
- పోనీ ఇక్కడ ప్రభుత్వం దగ్గర నిధులు లేవా..? బోలెడన్ని ఉన్నాయి.. 
- ఆ నిధులను మింగడానికి తప్ప మన యువతకోసం ఎందుకు ఖర్చుపెడతారు.. 
- రాజకీయం సరిగా లేని కారణంగా.. విదేశాలకు వలస వెళ్లడం జరుగుతోంది.. 
- ఇదిలాగే కొనసాగితే ఇండియా పూర్తిగా ఖాళీ కావడం ఖాయం.. 
- ప్రభుత్వం కళ్లుతెరవాలని డిమాండ్ చేస్తోంది " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ "..

download (1)

( స్పెషల్ కరస్పాండెంట్, హైదరాబాద్ )

Read More పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

మామా... నేను వెళ్లిపోతున్నా అమెరికాకు.. అక్కడే నా ఫ్యూచర్ ఉంది.. ఇలా ఉత్సాహంగా ఎందరో యువకుల అంటుంటారు.. వారి కళ్ళల్లో కలలు, ఆశలు మెరుస్తున్నాయి. ఇండియాలో టాప్‌ ర్యాంక్‌ సాధించిన ఎందరో యువకులు ఈ ప్రపంచాన్ని జయించాలని తపన పడుతుంటారు.. . తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ పంపిస్తారు.. తమ కొడుకు విదేశాల్లో సెటిల్‌ అయితే చాలు.. అనే ఆశతో జీవిస్తుంటారు..  కానీ... ఆ ఆశల వెనక ఉన్న నిజాలు ఎవరూ చెప్పలేరు.. విదేశాల్లో ఉన్నవారికి ఎదురయ్యే మానసిక ఒత్తిడి, జాత్యహంకార దాడులు, ఆర్థిక ఇబ్బందులు, వీసా సమస్యలు, ఇంకా కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయ స్థితులు కూడా ఎదురవుతుంటాయి.. దీనంతటికీ కారణం మన ప్రభుత్వాలు కాదా..? ఎందరో మేధావులను తయారు చేస్తున్న మన విద్యా వ్యవస్థ ఆ మేధావులకు సరైన ఉపాధి కల్పించలేక పోతోంది.. ఇంతకంటే దురదృష్టకరం ఏముంటుంది..? విద్యా వ్యవస్థకు, ఉపాధి వ్యవస్థకు తగినంత నిధులు కేటాయించకపోతే అసలు ఈ రాజకీయాలెందుకు, ఈ ప్రభుత్వాలు ఎందుకు..? ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భారతదేశంలోని మేధస్సు ఖాళీ అయిపోయి.. కేవలం ఒక పనికిరాని వ్యవస్థగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది.. దీనిపై ప్రభుత్వాలు కొంచమైనా ఆలోచించాలి.. 

Read More నామినేషన్ ప్రక్రియలో పొరపాట్లు జరగకుండా చూడాలి

 
ఇటీవలి కాలంలో అనేక మంది భారతీయ విద్యార్థులు విదేశీ నేలపై దురదృష్టకరంగా, దుర్భరంగా  ప్రాణాలు కోల్పోయారు. కొందరు ఉద్యోగాలు దొరకక ఆత్మహత్యలు చేసుకున్నారు, ఇంకొందరిని అక్కడి స్థానికులు దాడి చేశారు. ఇలాంటివి వింటున్నప్పుడు అందరి హృదయాలు ద్రవిస్తూ ఉంటాయి.. మరి దీనికి కారణం ఎవరో.. వాళ్ళుమాత్రం స్పందించడం లేదు.. అదే మన పాపం.. 

Read More జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ చేపట్టిన సుందరీకరణ పనులు దాదాపు పూర్తి..

ప్రపంచం ఎంత ఆధునికమైనా... మన బిడ్డలకు అక్కడ భద్రత కల్పించే వ్యవస్థ అంతగా లేదు. అన్నది తల్లిదండ్రులు గ్రహించాలి.. ముఖ్యంగా నాయకులు, ప్రభుత్వాలు గ్రహించాలి..  ప్రతి ఏడాది లక్షలాది విద్యార్థులు విదేశాలకు వెళ్తున్నారు.. ఎక్కువగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూరప్ దేశాలకు. వెళ్తున్నారు ఇలా ఎందుకు జరుగుతోంది ?

Read More మాజీ ఎమ్మెల్యేను మర్యాద పూర్వకంగా కలిసిన ఏకగ్రీవమైన సర్పంచ్ కేతిరి

ఎందుకంటే మన దేశంలో ఉన్న విద్యా అవకాశాలపై విశ్వాసం తగ్గింది. ఉపాధి అవకాశాలు మృగ్యమై పోయాయి..  ముఖ్యంగా మన ప్రభుత్వం ఇచ్చే రీసెర్చ్‌ సపోర్ట్‌, ఇన్నోవేషన్‌ ప్రోత్సాహం చాలా తక్కువ. కానీ దయచేసి ఆలోచించండి.. వాళ్లు చదువుకుని వచ్చిన తర్వాత ఎక్కడ పనిచేస్తున్నారు? విదేశీ కంపెనీల్లోనే కదా! భయంకరమైన వాస్తవం ఏమిటంటే మన మేధస్సు మన దేశం కోసం కాదు, విదేశాల కోసం పనిచేస్తోంది.

Read More అంతర్జాతీయ మహిళలపై హింస నిర్మూలన దినోత్సవం

అసలు ప్రభుత్వం చేయాల్సింది ఏమిటి..?

Read More తుది మెరుగులు దిద్దుకుంటున్న బ‌మృక్‌నుద్దౌలా చెరువు

విద్యా వ్యవస్థలో ప్రామాణికత పెంచాలి. ప్రపంచ స్థాయి రీసెర్చ్‌ సెంటర్స్‌, స్టార్టప్‌ ల్యాబ్స్‌ సృష్టించాలి. మరీ మరీ ముఖ్యంగా ప్రతిభకు అవకాశాలు ఇవ్వాలి. ఆదిశగా కృషి చేయాలి.. యంగ్ సైంటిస్టులు, టెక్ స్టూడెంట్స్‌కు ఇండియాలోనే అంతర్జాతీయ స్థాయి ఫండింగ్ ఇవ్వాలి. విదేశాల్లో ఉన్న విద్యార్థులకు భద్రతా హామీ ఇవ్వాలి. ప్రతి దేశంలో  ఇండియన్ స్టూడెంట్ హెల్ప్ సెల్ల్ ఏర్పాటు చేసి, ఎమర్జెన్సీ సపోర్ట్ లైన్ కల్పించాలి. ఇక రివర్స్ బ్రెయిన్ డ్రైన్ ను ప్రోత్సహించాలి.

Read More అంధుల పాఠశాల విద్యార్థినితో కలిసి పాడిన జిల్లా కలెక్టర్


విదేశాల్లో చదువుకున్నవాళ్లు తిరిగి వచ్చి మన దేశంలోనే పరిశోధన, పరిశ్రమల అభివృద్ధికి దోహదపడేలా చేయాలి. మన మేధస్సు మనకే వాడుక కావాలి.. అయితే ఇప్పుడు కొంతమంది విద్యార్థులు తమ చదువు అనంతరం ఇండియాకి తిరిగి వస్తున్నారు.. అమెరికాల్లాంటి దేశాల్లో పెద్ద పెద్ద కంపెనీల ఆఫర్లను తిరస్కరించి మన దేశంలోని పెద్ద పెద్ద నగరాల్లో  ఇన్నోవేషన్‌ స్టార్టప్‌ లు ప్రారంభిస్తున్నారు.. 
వాళ్లంతా ఇంకో దేశానికి మా మేధస్సు ఇచ్చి వెళ్ళిపోము.. నా మాతృదేశానికే అంకితం చేస్తాం.. అని చెబుతున్నప్పుడు ఎంతో గర్వంగా అనిపిస్తుంది..  ఇదే మనందరికీ కావాల్సిన ఆలోచన. మన పిల్లల కలలు ఎక్కడ నెరవేరినా.. వారి గుండె, వారి సేవ భారతదేశానికి మేలు చేయాలి. అని తల్లిదండ్రులు భావించాలి.. 

Read More క్రీడలకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం

ముఖ్యంగా ప్రభుత్వం కంట్రిబ్యూషన్ అవసరం.. భారతీయ మేధస్సును, భారతీయ పౌరుషాన్ని, భారతీయ కృషిని, భారతీయ రక్తాన్ని విదేశాలకు ఎగుమతి కాకుండా చూడాలి..  అవసరమైతే అందుకోసం ఎన్ని కోట్లయినా ఖర్చుపెట్టగలగాలి.. ఖర్చయినా పైకం ఎక్కడికీ పోదు.. అది ఈ గడ్డమీదే నిక్షిప్తమై ఉంటుంది..  ' సేవ్ ఇండియన్ బ్రైన్స్.. డోంట్ మేక్ ఇట్ యూస్ లెస్ డ్రైన్స్ ' అని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తోంది " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ "..

Read More అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు

About The Author