డ్రైనేజీ పొంగి పొర్లుతున్నా పట్టించుకునే నాథుడు లేడు

  • దుర్గందమయంగా మారిన చెరుకు తోట కాలనీ 
  • పది రోజులయినా అధికారులు పత్తా లేరు
  • సమస్య తీర్చకపోతే వేలాదిమందితో సత్యాగ్రహ దీక్షకు సిద్దమని హెచ్చరిక

డ్రైనేజీ పొంగి పొర్లుతున్నా పట్టించుకునే నాథుడు లేడు

ఎల్బీనగర్:

సరూర్నగర్ డివిజన్ చెరుకు తోట కాలనీలో పది రోజులుగా డ్రైనేజీ నీళ్లు పొంగిపొర్లుతూ కాలనీ మొత్తం కంపుతో, దుర్గందమయంగా మారిన సందర్భంగా చెరుకుతోట కాలనీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, సోమవారం ప్రజావాణిలో రాతపూర్వకంగా ఫిర్యాదు చేయగా, మంగళవారం ఉదయం చెరుకు తోట సరూర్నగర్ డివిజన్ జలమండలి డీజీఎం చందు నాయక్ వర్క్ ఇన్స్పెక్టర్లు రాజేష్ నాయక్ గల్ఫర్ సిబ్బందితో సందర్శించారు. ఇక్కడ సమస్య ఉన్న ప్రాంతానికి అధికారులకు సరూర్నగర్ డివిజన్ కాలనీ సంక్షేమ సంఘాల జేఏసీ అధ్యక్షులు బేర బాలకిషన్ కాలనీవాసులు రంజిత్, పోచమ్మ బస్తీ కాలనీ నార్త్ సంక్షేమ సంఘం నాయకులు  శ్రీనివాస్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, మోహన్ ఆచారి మహిళా నాయకురాళ్లతో కలిసి  వారి దృష్టికి తీసుకొని వచ్చారు.
ఈ సందర్భంగా అధికారులను తీసుకొని కాలనీ అంతా కలియ తిరుగుతూ, డ్రైనేజీ నీళ్లు శాశ్వతంగా రాకుండా పరిష్కారం కనుక్కోవాలని డీజీఎం చందు నాయక్ దృష్టికి తీసుకొని వచ్చారు.వారం రోజుల్లో డ్రైనేజీ లైను కొత్తగా మార్చేసి సమస్యను పరిష్కరిస్తామని వాటర్ వర్క్స్ డీజిఎం చందు నాయక్ వారి సిబ్బంది కాలనీవాసులకు, నాయకులకు హామీ ఇచ్చారు.
 ఈ సందర్భంగా సరూర్నగర్ డివిజన్ కాలనీ సంక్షేమ సంఘాల జేఏసీ అధ్యక్షులు బేర బాలకిషన్ మాట్లాడుతూ ఒక చెరుకు తోట కాలనీలోనే కాకుండా సరూర్నగర్ డివిజన్ పరిధిలోని సరూర్నగర్ ఓల్డ్ విలేజ్ పోచమ్మ బాగ్ కాలనీ పంజాల అనిల్ కుమార్ కాలనీ హుడా కాలనీ, హుడా కాంప్లెక్స్ అంబేద్కర్ నగర్ లోని అనేక కాలనీలలో వాటర్ వర్డ్స్ అధికారుల సమన్వయ లోపంతో డ్రైనేజీ లైన్లన్నీ డ్యామేజ్ అయినవి గుర్తించలేని పరిస్థితుల్లో ఉన్నారని వెంటనే జలమండలి, జిహెచ్ఎంసి అధికారులు సమన్వయతో పనిచేసి సరూర్నగర్ డివిజన్లో ఉన్నటువంటి సమస్యలను వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, వారం పది రోజుల్లో పరిస్థితి చక్కబడకపోతే వేలాదిమంది కాలనీవాసులతో, మహిళా సంఘాలతో జిహెచ్ఎంసి సరూర్నగర్ సర్కిల్ ముందు ప్రజల పక్షాన సమస్యల పరిష్కారం కోసం సత్యాగ్రహం నిర్వహిస్తామని బేర బాలకిషన్ అధికారులను హెచ్చరించారు.

About The Author