అష్టలక్ష్మి దేవాలయం నూతన కమిటీ ఎన్నిక
ఎల్బీనగర్
ఆర్కేపురం డివిజన్ వాసవి కాలనీలోని అష్టలక్ష్మి దేవాలయం నూతన పాలకవర్గానికి ఆదివారం ఎన్నికలు జరిగాయి. దేవాలయం చైర్మన్ గా నాగమల్ల శ్రవణ్ కుమార్, వైస్ ఛైర్మెన్ గా వనం యాదయ్య, ప్రధాన కార్యదర్శిగా మైధం సుధాకర్ గుప్తా, కోశాధికారిగా దాచేపల్లి శ్రీనివాస్, కార్యదర్శులుగా శ్రీనివాసు గోవిందు, కొక్కొండ చంద్రశేఖర్, బికుమళ్ళ పవన్ కుమార్ లు ఎన్నికైనారు. ఎలక్షన్ అధికారులుగా గౌరిశెట్టి చంద్రశేఖర్, భరద్వాజ్, ఉప్పల నాగేశ్వర్ రావు,పబ్బా శ్రీనివాస్ లు వ్యవహారించారు.
About The Author
16 Mar 2026
