జాగృతి ఇక 'పొలిటికల్' ఎంట్రీ!
- ప్రజల ఆకాంక్షే చారిత్రాత్మక అవసరం
- స్పష్టం చేసిన రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కప్పాటి పాండురంగారెడ్డి
హైదరాబాద్
తెలంగాణ ఉద్యమ గొంతుకగా, సాంస్కృతిక సారథిగా ప్రస్థానాన్ని మొదలుపెట్టిన 'తెలంగాణ జాగృతి' త్వరలోనే రాజకీయ పార్టీగా అవతరించబోతోంది. తెలంగాణ సమాజం, ప్రజల ఆకాంక్షల మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం ఒక చారిత్రాత్మక ఘట్టమని తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కప్పాటి పాండురంగారెడ్డి స్పష్టం చేశారు.
తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జన్మదినాన్ని పురస్కరించుకుని, శుక్రవారం నగరంలోని ఆమె నివాసంలో పాండురంగారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. సంస్థ భవిష్యత్తు కార్యాచరణపై కీలక సంకేతాలిచ్చారు.
"తెలంగాణ అస్థిత్వాన్ని ప్రపంచ వేదికలపై చాటిన కవితమ్మ గారు, ఇప్పుడు అదే స్ఫూర్తితో పూర్తిస్థాయి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టడం తెలంగాణ భవిష్యత్తుకు శుభసూచకం. ఏళ్ల తరబడి సాంస్కృతిక చైతన్యంతో ప్రజలను ఏకం చేసిన జాగృతి, ఇకపై రాజకీయ వేదికగా ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తుంది" అని పాండురంగారెడ్డి పేర్కొన్నారు. ప్రజల పక్షాన నిలబడాలన్న సంకల్పమే ఈ పార్టీ ఆవిర్భావానికి పునాది అని ఆయన స్పష్టం చేశారు.
About The Author
14 Mar 2026
