"నామిశ్రీ ఆరియా" లో ప్లాట్లు కొంటే మోసపోవాల్సిందే..!
నాగోల్ బండ్లగూడ లో జరుగుతున్న వేలకోట్ల అవినీతి రియల్ ఎస్టేట్ మోసం
- రూ. 1,000 కోట్ల ప్రభుత్వ భూమిని మింగేసిన నమిశ్రీ కబ్జా రాయుళ్లు..
- అనుమతులు సర్వే నంబర్ 121లో.. నిర్మాణాలు మాత్రం అటవీ భూమిలో!
- నకిలీ స్కెచ్‌లతో అధికారులను బురిడీ కొట్టించిన రియల్ ఎస్టేట్ మాఫియా
- ఫిర్యాదు చేసి సంవత్సరం గడిచినా పట్టించుకోని అధికార గణం,
- హెచ్.ఎం.డీ.ఏ, టౌన్ ప్లానింగ్ అధికారులు, నాగోల్ సర్కిల్ ఎల్బీనగర్ జోన్ అధికారులు, రెవెన్యూ ఫారెస్ట్ అధికారులు, ముడుపులకు అమ్ముడుపోయారా ..!
- ప్లాట్లు కొనే సామాన్య మధ్యతరగతి ప్రజలను తడిగుడ్డుతో గొంతు కోస్తున్న నామిస్త్రీ దొంగలు..
- విజిలెన్స్, ఏసీబీ, నిఘా విభాగాల చర్యలు ఎక్కడ..?
- అవినీతికి చెక్ పెట్టే రియల్ ఎస్టేట్ రెగ్యులేటివ్ అథారి "రేరా" చర్యలు ఎక్కడ..?
- మల్కాజ్గిరి కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, మున్సిపల్ శాఖ మాత్యులు సీఎం రేవంత్ రెడ్డి, ఈ అవినీతి పై దృష్టి సారించాలి..
- (ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ అందిస్తున్న ప్రత్యేక కథనం)
అటవీ భూమిని కాపాడాల్సిన అధికారులే ఆక్రమణదారులకు కొమ్ముకాస్తున్నారు. ఏకంగా రూ. వెయ్యి కోట్లకు పైగా విలువ చేసే ప్రభుత్వ, అటవీ భూములను ఓ బడా నిర్మాణ సంస్థ కబ్జా చేసి, ఆకాశహర్మ్యాలను నిర్మిస్తోంది. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తట్టి అన్నారంలో నమిశ్రీ (సమీశ్రీ) సంస్థ చేపట్టిన 'అరియా' ప్రాజెక్ట్ వెనుక సాగుతున్న అక్రమాల చిట్టా ఇప్పుడొకటి బయటపడింది. అటు రెవెన్యూ, ఇటు ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌ను, మున్సిపల్ రెవిన్యూ నిబంధనలను లెక్కచేయకుండా.. ఏకంగా నకిలీ పత్రాలతో హెచ్‌ఎండీఏ నుంచే పర్మిషన్లు కొట్టేయడం వెనుక సాగిన 'అక్రమ బాగోతం' ఇప్పుడు అధికార యంత్రాంగం వైఫల్యానికి అద్దం పడుతోంది..jpeg)
అనుమతులు ఒకచోట.. కబ్జా మరోచోట
* RERA రిజిస్ట్రేషన్ నంబర్: 02400061375
* HMDA బిల్డింగ్ పర్మిషన్ (BP) నంబర్: 001610/BP/HMDA/0341/g1/GHT/2023
.jpeg)
పోలీసులకు దొరికినా.. అధికారులు నిద్ర మత్తులో!
ఈ అక్రమాల్లో ఫోర్జరీ పత్రాల వాసన రావడంతో ఆర్డీఓ విచారణ చేపట్టి, అసలు బండారాన్ని బయటపెట్టారు. సి. అమరేందర్ రెడ్డి, పి. ధర్మవీర్ రెడ్డిపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. అయినా సరే, నిర్మాణ పనులు మాత్రం ఆగలేదు.
ప్రశ్నార్థకమైన మౌనం: 2025, జూన్ 18నే 'ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ ఉమెన్ రైట్స్' సంస్థ హెచ్‌ఎండీఏ కమిషనర్ నుంచి జిల్లా కలెక్టర్ వరకు అందరికీ ఆధారాలతో సహా ఫిర్యాదు చేసింది.
మధ్యతరగతి జనం నిండా మునిగేనా?
ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే వందల కోట్ల బ్యాంకు రుణాలు మంజూరయ్యాయి. అమాయక కస్టమర్ల నుంచి లక్షలాది రూపాయల అడ్వాన్స్‌లు వసూలు చేశారు. రేపు ప్రభుత్వం ఈ అనుమతులను రద్దు చేస్తే, ఆ బాధ్యత ఎవరిది? రిజిస్ట్రేషన్లు ఆపకుండా అక్రమాలకు సహకరిస్తున్న సరూర్నగర్ సబ్ రిజిస్టర్ కార్యాలయ తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..jpeg)
నిబంధనల ఉల్లంఘన - అధికారుల నిర్లక్ష్యం:
రెవెన్యూ, ఇరిగేషన్, ఎయిర్‌పోర్ట్ అథారిటీల NOCలు లేకుండా, రెవెన్యూ స్కెచ్ లేని ప్రాజెక్టుకు అనుమతులు ఎలా ఇచ్చారు? అక్రమాలు జరుగుతున్నాయని ఏడాదిగా ఫిర్యాదులు అందుతున్నా.. ఎందుకు చర్యలు తీసుకోలేదు? దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలి.
మరిన్ని ఆధారాలతో తదుపరి కథనంలో....
.jpeg)
