పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతీ ఒక్కరి బాధ్యత..
- సరూర్నగర్ డిప్యూటీ కమీషనర్ బోనగిరి శ్రీనివాస్ పిలుపు
- వెంకటేశ్వర కాలనీ, జేబీ కాలనీలలో గ్యాంగ్ వర్క్
ఎల్బీనగర్:
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా ఆదివారం సరూర్నగర్ డివిజన్ పరిధిలోని శ్రీ వెంకటేశ్వర కాలనీ, డాక్టర్స్ కాలనీలోని జింకలబావి కాలనీలలో చేపట్టిన శ్రమ దాన కార్యక్రమంలో సరూర్నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్, ఎల్బీనగర్ సర్కిల్ ఇంచార్జి బోనగిరి శ్రీనివాస్, డిఈఈ చందన, ఎస్ఎస్ బుచ్చయ్య శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు. ఇందులో భాగంగా కాలనీలో పేరుకుపోయిన చెత్త, చెదారాన్ని రోడ్డుకు ఇరువైపులా ఉన్న వేస్టేజ్ లను కాలనీ అసోసియేషన్ సభ్యులతో కలిసి తొలగించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, కాలనీలలో రోడ్లపై చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంటేనే కాలనీ ప్రజల ఆరోగ్యం కూడా క్షేమంగా ఉంటుందన్నారు. కాలనీలో పరిశుభ్రంగా ఉండడానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర కాలనీ అధ్యక్షుడు గండు ధనంరెడ్డి,జేబీ కాలనీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు మారోజు శ్రీనివాసరావు, మాధవ్ రెడ్డి, వెంకటేష్ యాదవ్, వెంకటేశ్వర్ రావు, ప్రధాన కార్యదర్శి కనకారావు, కోశాధికారి సాయికిరణ్, కాలనీ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ తులసి కృష్ణమూర్తి, టి శ్రీనివాసరావు, నందకుమార్, సుధాకర్ ఆచారి, మునగాల నరేష్, అనిల్ చెన్న, కృష్ణంరాజులతోపాటు ఎస్ఎఫ్ఏలు సూర్య, నల్ల శ్రీనివాస్,ఆర్ స్వామి, టి సత్యనారాయణ పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.
