ఇక్కడ మాకు పోలీస్ స్టేషన్ వద్దని కాలనీవాసుల ఆందోళన
ఎల్బీనగర్:
ఎల్బీనగర్ నియోజకవర్గంలోని చైతన్యపురి డివిజన్ ప్రభాత్ నగర్ కాలనీలోని మాధవరెడ్డి కమ్యూనిటీ హల్ పోలీస్ స్టేషన్ కి ఇవ్వమని కాలనీవాసులంతా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో కాలనీవాసుల వినతిమేరకు బుధవారం ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ప్రభాత్ నగర్ చేరుకొని వారికి సంఘీభావం ప్రకటించారు.ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో టీమ్స్ హాస్పిటల్ ప్రాంగణంలో పోలీస్ స్టేషన్, విద్యుత్ సబ్ స్టేషన్,పార్క్ స్థలం కోసం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ని కోరడంతో వారు వెంటనే సానుకూలంగా స్పందించి వెంటనే మంజూరు చేయడం జరిగిందని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం ఈ స్థలం ఇప్పుడు ఇచ్చే అవకాశం లేదని తెలియజేసిన నేపథ్యంలో ప్రభాత్ నగర్ కాలనీ కమ్యూనిటీ హాల్ పోలీస్ స్టేషన్ కోసం అడుగుతున్న నేపథ్యంలో రెండు,మూడు రోజుల్లో స్థానిక రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ని కలిసి పోలీస్ స్టేషన్ కు ఇచ్చే ప్రయత్నం విరమించుకోవాలని కోరడం జరుగుతుందని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు నరసింహ గుప్త, విట్టల్ రెడ్డి, నాయకులు చంద్రశేఖర్ రెడ్డి,సురేందర్ రెడ్డి, ప్రభాత్ నగర్ కాలనీ అధ్యక్షులు బాల్ రెడ్డి, గట్టు శ్రీను, రమణారెడ్డి, రామారావు, రాజేష్, నాగేందర్,బాలరాజు,విద్యా సాగర్,నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
