ప్రాక్టీస్ సెషన్లో దుమ్ము రేపిన ఉమ్రాన్ మాలిక్.. గంటకు 163.7 కి.మీ. వేగంతో బౌలింగ్?

భారత జట్టు సొంత గడ్డ మీద దక్షిణాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. రేపటి నుంచి ప్రారంభం కానున్న వేళ అందరి చూపు స్పీడ్ గన్ ఉమ్రాన్ మాలిక్‌పై పడింది. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన ఉమ్రాన్.. 14 మ్యాచ్‌ల్లో 22 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఈ ఐపీఎల్ సీజన్లో గంటకు 150 కిలోమీటర్లకుపైగా వేగంతో బంతులు విసిరిన మాలిక్ సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. దీంతో ఐపీఎల్ ప్రదర్శనతోనే నేరుగా భారత జట్టుకు ఎంపికయ్యాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్ ప్రారంభానికి ముందు నెట్స్‌లో శ్రమిస్తోన్న ఉమ్రాన్ మాలిక్.. ప్రాక్టీస్ సెషన్లో గంటకు 163.7 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇది ఎంత వరకు నిజమో తెలియదు గానీ.. సౌతాఫ్రికాతో జరిగే సిరీస్‌లో ఉమ్రాన్ ఇంతే స్పీడ్‌తో బంతిని విసిరితే మాత్రం పాక్ బౌలర్ షోయబ్ అక్తర్ రికార్డ్ బ్రేక్ కావడం ఖాయం. ప్రపంచంలో అత్యంత వేగంగా బంతిని విసిరిన రికార్డ్ ఇప్పటి వరకూ అక్తర్ పేరిటే ఉంది. రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌గా పేరొందిన అక్తర్.. 2002లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గంటకు 161.3 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరాడు. అయితే ఉమ్రాన్ మాలిక్‌‌కు దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో తుది జట్టులో చోటు దక్కడం అనుమానమే. కోచ్ రాహుల్ ద్రావిడ్ చేసిన వ్యాఖ్యలే అందుకు కారణం. మాలిక్ ఇంకా నేర్చుకునే దశలో ఉన్నాడన్న ద్రావిడ్.. ఉమ్రాన్ తనను తాను మెరుగుపర్చుకుంటున్నాడన్నాడు. మ్యాచ్‌లు ఆడే కొద్దీ అతడు మెరుగవుతాడన్నాడు. ‘మా కోణంలో నుంచి చూస్తే.. జట్టులో మాలిక్ లాంటి ఆటగాడు ఉండటం ఎంతో ఆనందాన్నిస్తుంది. అతడికి తుది జట్టులో చోటు కల్పించే విషయంలో మనం వాస్తవికంగా ఆలోచించాలి. మా జట్టు ఇప్పటికే ఎంతో పెద్దది.. అందరికీ తుది జట్టులో చోటు కల్పించడం సాధ్యం కాదు’ అని ద్రావిడ్ వ్యాఖ్యానించాడు. మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఫామ్‌లోకి రావడం పట్ల కోచ్ సంతోషం వ్యక్తం చేశాడు. భారత జట్టు భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్‌లతో బరిలోకి దిగుతుందని ద్రావిడ్ హింట్ ఇచ్చాడు. అదే జరిగితే ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్‌లు కొంత కాలం వేచి ఉండాల్సి రావచ్చు. ఉమ్రాన్‌కు ఎప్పుడు భారత్ తరఫున ఆడే అవకాశం లభించినా.. అక్తర్ రికార్డ్ బ్రేక్ కావడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. బుమ్రా, షమీ, భువనేశ్వర్ యార్కర్లు వేస్తుంటే టీవీల్లో చూసేవాడిని అన్న మాలిక్.. ఇప్పుడు వారిత కలిసి ఆడనుండటం ఎంతో సంతోషానిస్తోందన్నాడు.

ప్రాక్టీస్ సెషన్లో దుమ్ము రేపిన ఉమ్రాన్ మాలిక్.. గంటకు 163.7 కి.మీ. వేగంతో బౌలింగ్?

భారత జట్టు సొంత గడ్డ మీద దక్షిణాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. రేపటి నుంచి ప్రారంభం కానున్న వేళ అందరి చూపు స్పీడ్ గన్ ఉమ్రాన్ మాలిక్‌పై పడింది. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన ఉమ్రాన్.. 14 మ్యాచ్‌ల్లో 22 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఈ ఐపీఎల్ సీజన్లో గంటకు 150 కిలోమీటర్లకుపైగా వేగంతో బంతులు విసిరిన మాలిక్ సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. దీంతో ఐపీఎల్ ప్రదర్శనతోనే నేరుగా భారత జట్టుకు ఎంపికయ్యాడు.

దక్షిణాఫ్రికాతో సిరీస్ ప్రారంభానికి ముందు నెట్స్‌లో శ్రమిస్తోన్న ఉమ్రాన్ మాలిక్.. ప్రాక్టీస్ సెషన్లో గంటకు 163.7 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇది ఎంత వరకు నిజమో తెలియదు గానీ.. సౌతాఫ్రికాతో జరిగే సిరీస్‌లో ఉమ్రాన్ ఇంతే స్పీడ్‌తో బంతిని విసిరితే మాత్రం పాక్ బౌలర్ షోయబ్ అక్తర్ రికార్డ్ బ్రేక్ కావడం ఖాయం. ప్రపంచంలో అత్యంత వేగంగా బంతిని విసిరిన రికార్డ్ ఇప్పటి వరకూ అక్తర్ పేరిటే ఉంది. రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌గా పేరొందిన అక్తర్.. 2002లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గంటకు 161.3 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరాడు.

అయితే ఉమ్రాన్ మాలిక్‌‌కు దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో తుది జట్టులో చోటు దక్కడం అనుమానమే. కోచ్ రాహుల్ ద్రావిడ్ చేసిన వ్యాఖ్యలే అందుకు కారణం. మాలిక్ ఇంకా నేర్చుకునే దశలో ఉన్నాడన్న ద్రావిడ్.. ఉమ్రాన్ తనను తాను మెరుగుపర్చుకుంటున్నాడన్నాడు. మ్యాచ్‌లు ఆడే కొద్దీ అతడు మెరుగవుతాడన్నాడు.

‘మా కోణంలో నుంచి చూస్తే.. జట్టులో మాలిక్ లాంటి ఆటగాడు ఉండటం ఎంతో ఆనందాన్నిస్తుంది. అతడికి తుది జట్టులో చోటు కల్పించే విషయంలో మనం వాస్తవికంగా ఆలోచించాలి. మా జట్టు ఇప్పటికే ఎంతో పెద్దది.. అందరికీ తుది జట్టులో చోటు కల్పించడం సాధ్యం కాదు’ అని ద్రావిడ్ వ్యాఖ్యానించాడు. మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఫామ్‌లోకి రావడం పట్ల కోచ్ సంతోషం వ్యక్తం చేశాడు.

భారత జట్టు భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్‌లతో బరిలోకి దిగుతుందని ద్రావిడ్ హింట్ ఇచ్చాడు. అదే జరిగితే ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్‌లు కొంత కాలం వేచి ఉండాల్సి రావచ్చు. ఉమ్రాన్‌కు ఎప్పుడు భారత్ తరఫున ఆడే అవకాశం లభించినా.. అక్తర్ రికార్డ్ బ్రేక్ కావడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. బుమ్రా, షమీ, భువనేశ్వర్ యార్కర్లు వేస్తుంటే టీవీల్లో చూసేవాడిని అన్న మాలిక్.. ఇప్పుడు వారిత కలిసి ఆడనుండటం ఎంతో సంతోషానిస్తోందన్నాడు.

About The Author

Related Posts