ఫుట్ బాల్ మైదానంలో అవసరమైన వసతులు: జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

ఖమ్మం ప్రతినిది (భారత శక్తి ), పిబ్రవరి 06: ఫుట్ బాల్ మైదానంలో అవసరమైన వసతులు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. గురువారం కలెక్టర్, రఘునాథపాలెం మండలం వివిపాలెం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సందర్శించి, పాఠశాలలోని ఫుట్ బాల్ మైదానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు ఫుట్ బాల్ ప్రాక్టిస్ చేసుకునేందుకు వీలుగా గ్రౌండ్ లెవెలింగ్ చేయడం, ఎర్ర మట్టి వేయడం, ఎటువంటి రాళ్ళు లేకుండా గ్రౌండ్ ను శుభ్రం చేయడం, పిచ్చి మొక్కల తొలగింపు వంటి పనులు చేపట్టాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. గ్రౌండ్ లో ఉన్న పెద్ద చెట్లను తొలగించవద్దని, అక్కడ కూర్చోని గేమ్ చూసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. మురికి నీరు గ్రౌండ్ లోకి రాకుండా డ్రైయిన్ నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్దం చేసి నివేదిక అందించాలని అన్నారు. పాత భవనాల డిమాలిషన్ కు సైతం ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. గ్రౌండ్ కు కాంపౌండ్ వాల్ ఉందని అధికారులు తెలిపారు. గ్రౌండ్ లో ఫుట్ బాల్ ప్రాక్టిస్ చేసుకునేందుకు వీలుగా అవసరమైన నెట్స్ ఏర్పాటు చేయాలని అన్నారు. గ్రౌండ్ లెవెలింగ్ చేసి, అవసరమైన అభివృద్ధి పనుల ప్రతిపాదనలు అందించాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి, యువజన సంక్షేమ అధికారి సునీల్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాద్యాయులు, కోచ్ ఆదర్శ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

ఫుట్ బాల్ మైదానంలో అవసరమైన వసతులు: జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

ఖమ్మం ప్రతినిది (భారత శక్తి ), పిబ్రవరి 06:

ఫుట్ బాల్ మైదానంలో అవసరమైన వసతులు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు.

గురువారం కలెక్టర్, రఘునాథపాలెం మండలం వివిపాలెం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సందర్శించి, పాఠశాలలోని ఫుట్ బాల్ మైదానాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు ఫుట్ బాల్ ప్రాక్టిస్ చేసుకునేందుకు వీలుగా గ్రౌండ్ లెవెలింగ్ చేయడం, ఎర్ర మట్టి వేయడం, ఎటువంటి రాళ్ళు లేకుండా గ్రౌండ్ ను శుభ్రం చేయడం, పిచ్చి మొక్కల తొలగింపు వంటి పనులు చేపట్టాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.

గ్రౌండ్ లో ఉన్న పెద్ద చెట్లను తొలగించవద్దని, అక్కడ కూర్చోని గేమ్ చూసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. మురికి నీరు గ్రౌండ్ లోకి రాకుండా డ్రైయిన్ నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్దం చేసి నివేదిక అందించాలని అన్నారు. పాత భవనాల డిమాలిషన్ కు సైతం ప్రణాళికలు రూపొందించాలని అన్నారు.

గ్రౌండ్ కు కాంపౌండ్ వాల్ ఉందని అధికారులు తెలిపారు. గ్రౌండ్ లో ఫుట్ బాల్ ప్రాక్టిస్ చేసుకునేందుకు వీలుగా అవసరమైన నెట్స్ ఏర్పాటు చేయాలని అన్నారు. గ్రౌండ్ లెవెలింగ్ చేసి, అవసరమైన అభివృద్ధి పనుల ప్రతిపాదనలు అందించాలని కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి, యువజన సంక్షేమ అధికారి సునీల్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాద్యాయులు,
కోచ్ ఆదర్శ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related Posts