ప్రజావాణి లో 91 దరఖాస్తులు : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
కామారెడ్డి :
ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జిదారుల నుండి అర్జీలను స్వీకరించారు.
ఈ సందర్భంగా ప్రజావాణిలో 91 దరఖాస్తులు వివిధ శాఖలకు సంబంధించిన ఆయా దరఖాస్తులను సంబంధిత అధికారులకు ఇస్తూ అర్జీదారుని సమస్యను క్లుప్తంగా పరిశీలించి వెంటనే పరిష్కరించాలన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లు, డిడబ్ల్యూఓ, డబుల్ బెడ్ రూమ్, వ్యవసాయం, పంచాయితీ, తదితర దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.
కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల మార్కవుట్ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
అలాగే భూ భారతి, ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలని ఆన్నారు.
అనంతరం 90 వ జిల్లా పారిశ్రామిక ప్రోత్సాహక కమిటీ (డిఐపిసి) సమావేశం సోమవారం ఐడిఓసి లో జిల్లా డిఐపిసి చైర్మన్ , జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధ్యక్షతన, డిఐపిసి కమిటీ సభ్యుల సమక్షంలో నిర్వహించబడింది.
అదేవిధంగా టి-పిఆర్ఐడిఈ పథకం (ఎస్ సి పి) కింద అజెండా అంశాలను కమిటీ చర్చించింది. ఈ పథకం కింద 5 దరఖాస్తులకు పెట్టుబడి రాయితీగా రూ.16,71,090/- (పదహారు లక్షల డెబ్బై ఒక వేల తొంభై రూపాయలు మాత్రమే) మంజూరు చేయబడిందన్నారు.
అలాగే టి ఎస్ పి కేటగిరీ కింద 5 దరఖాస్తులకు పెట్టుబడి సబ్సిడీగా రూ.18,05,206/- (పద్దెనిమిది లక్షల ఐదు వేల రెండువందల ఆరు రూపాయలు మాత్రమే) మంజూరు చేయబడిందని
ఇంకా, రెండు కోల్ అలాట్‌మెంట్ ప్రతిపాదనలను కమిటీ ఆమోదించి, తదుపరి చర్యల నిమిత్తం ప్రధాన కార్యాలయానికి పంపించడం జరిగిందన్నారు.
