సంస్కృతి సాంప్రదాయాలు గుర్తుచేసే పండుగ - ఎమ్మెల్యే చింతా ప్రభాకర్

- ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంక్రాంతి వేడుకలు

సంస్కృతి సాంప్రదాయాలు గుర్తుచేసే పండుగ - ఎమ్మెల్యే చింతా ప్రభాకర్

సంగారెడ్డి:
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పాల్గొని పతంగులు ఎగరావేసి సందడి చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ మన సంప్రదాయాలు, సంస్కృతిని గుర్తు చేసే పండుగ అని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, ప్రజలందరూ కలిసి ఆనందంగా జరుపుకునే ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో సుఖశాంతులు నింపాలని ఆకాంక్షించారు. పండుగులను రాజకీయం చేయడం సారికదాని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ లు కాసాల బుచ్చిరెడ్డి, విజేందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు ఆర్.వెంకటేశ్వర్లు, కార్యదర్శి నర్సింలు, మాజీ జడ్పీటీసీ కొండల్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యేతో కలిసి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు.

About The Author

Related Posts