ఆదివాసీలు అన్ని రంగాల్లో రాణించాలి.

ఆదివాసీలు అన్ని రంగాల్లో రాణించాలి.

మణుగూరు:

ఆదివాసీలు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకొని అన్ని రంగాల్లో రాణించాలని సిఐ నాగబాబు కోరారు. గురువారం బడుగుల గ్రామంలో వలస ఆదివాసీలకు దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం వారితో మాట్లాడారు. ఏజెన్సీ పరిధిలో పిల్లలు చదువుకునేలాగా తల్లిదండ్రులు శ్రద్ద తీసుకోవాలని సూచించారు. అలాగే ఈయువత చేడు వ్యసనాలకు బానిసలు కాకుండా దూరంగా ఉండాలని తెలిపారు. మావోయిస్టులకు అనుమానిత వ్యక్తులకు సహాయ సహకారాలు అందించవద్దని సూచించారు. ఇలాంటి వారు ఎవరైనా తారస పడితే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రాజేష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related Posts