వర్షపు నీరు నిలిచే ప్రాంతాలను పరిశీలించిన డీసీపీ అనురాధ

వర్షపు నీరు నిలిచే ప్రాంతాలను పరిశీలించిన డీసీపీ అనురాధ

ఎల్బీనగర్:

ఎల్బీనగర్ డీసీపీ శ్రీమతి అనురాధ, ఐపీఎస్, సోమవారం ఉదయం ఎల్బీనగర్ బైరామల్ గూడ చౌరస్తా సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ముందు, వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని జీఎస్ఆర్ కన్వెన్షన్ హల్ దగ్గర రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో, వర్షపు నీరు నిల్వ ఉండి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, అలాగే సమస్యాత్మక ప్రాంతాలలో అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు మరియు ఎల్బీనగర్, వనస్థలిపురం పోలీస్ స్టేషన్ సిబ్బందికి సూచించడం జరిగింది. పోలీస్ అధికారులు ఏసీపీ కృష్ణయ్య, ఏసీపీ కాశిరెడ్డి, ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్, ట్రాఫిక్ ఏసీపీ నవీన్ రెడ్డి, లా అండ్ ఆర్డర్ మరియు ట్రాఫిక్ సిబ్బందితో కలిసి ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలలోని వాటర్ లాగింగ్ ప్రాంతాలను సందర్శించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ సీఐ వినోద్ కుమార్, వనస్థలిపురం సీఐ రవి బాబు, సిబ్బంది పాల్గొన్నారు.WhatsApp Image 2026-06-15 at 19.55.47

About The Author