భారత సంస్కృతికి విశేష కృషిచేసిన అహల్యా బాయి హోల్కర్

కరీంనగర్, ఫిబ్రవరి 14(భారత శక్తి): ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మహిళలు మూల స్తంభాలాంటివారని, నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని , గృహిణిగా బాధ్యతలను నిర్వర్తిస్తూనే పలు వ్యాపారాలు, వృత్తులు, ఉద్యోగాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని, పురుషులకు దీటుగా అన్ని రంగాల్లో ప్రతిభ చాటుతూ విజయాల బాటలో పయనిస్తున్నారని మహిళా సాధికారత , వ్యాపార వ్యవస్థాపకత కమిటీ చైర్మన్ బెల్లం మాధవి తెలిపారు. స్వదేశీ మేళా ప్రోగ్రాం లో భాగంగా శుక్రవారం మహిళా ఆర్థిక స్వాలంబన, అభివృద్ధి అంశంపై స్వశక్తి మహిళలకు సెమినార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె ముఖ్య వక్తగా హాజరై మాట్లాడుతూ మహిళలు చిన్న తరహా, కుటీర పరిశ్రమల వంటివి స్థాపించి తాము స్వయం ఉపాధి పొందడమే కాకుండా ఇతరులకు ఉపాధి కల్పిస్తున్నారన్నారు. మహిళలకు ఆసక్తి ఉన్న రంగంలో ఉపాధి అవకాశాలను వెతుక్కుని స్థిరపడుతున్నారన్నారు. మహిళలను శక్తివంతం చేయడమే లక్ష్యంగా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయని, వివిధ రంగాల్లో అనేక మహిళా సాధికారత కార్యక్రమాలు విజయవంతంగా చేపడుతున్నామన్నారు. ప్రధానంగా సాధికారత అంటే బాధ్యత తీసుకునే సామర్ధ్యమని , జీవితంలో తమ ఎంపికలను తామే నిర్ణయించుకునే హక్కు మహిళలకు ఉందన్నారు. అలాగే లింగ సమానత్వం, లైంగిక వేధింపులు, గృహహింస, చట్టపరమైన హక్కుల వంటి అంశాలపై అవగాహన పెంచడానికి , సాంప్రదాయ నైపుణ్యాలను అప్ గ్రేడ్ చేయడానికి, అదే సమయంలో కొత్త నైపుణ్యాలను ప్రోత్సహించడానికి వివిధ నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమాలలో మహిళలు తప్పకుండా పాల్గొనాలన్నారు. ఇవన్నీ కూడా మహిళలకు సాధికారత కల్పించే అంశాలేనన్నారు. మహిళలు అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకొని, జీవనోపాధిని మెరుగుపరచుకోవాలన్నారు. అనంతర కాలాంశంలో లోకమాత , ధీరవనిత అహల్యబాయి హోల్కర్ గురించి కేశవ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్, స్వదేశీ జాగరణ్ మంచ్ తెలంగాణ ప్రాంత మహిళా ప్రాంత మహిళా ప్రముక్ కళ్లెం స్వప్న మాట్లాడారు. భారతదేశ సంస్కృతికి అహల్య భాయి విశేష కృషి చేశారని, ఆమె చేసిన కృషికి గుర్తింపుగా ఆమె పేరిట శ్రీ శక్తి పురస్కారాన్ని నెలకొల్పారని చెప్పారు. పరిపాలన సమయంలో అహల్య భాయి సేవకు, దానధర్మాలకు మారుపేరుగా నిలిచారన్నారు. మమ్మదీయుల దాడుల్లో శిథిలమైన అనేక దేవాలయాలను పునర్నిర్మించారన్నారు. హిందూ ధర్మ పునరుత్తేజ్జానికి ఆమె విశేష కృషి చేశారన్నారు. శుక్రవారం మధ్యాహ్నం పాడిపంట, రైతు ఆర్థిక స్వాలంబన సెమినార్ కార్యక్రమానికి ముఖ్య వక్తగా ఎన్నారై సామ ఎల్లారెడ్డి హాజరై మాట్లాడారు. వ్యవసాయం అనేక విషయాల సమ్మిళితమని , ప్రధానంగా వ్యవసాయభివృద్ధి, గ్రామీణభివృద్ధితో దగ్గరి సంబంధం కలిగి ఉందన్నారు. గ్రామీణ జనాభాలో ఎక్కువమంది ఏదో రూపంలో వ్యవసాయంలో నిమగ్నమై ఉన్నారని తెలిపారు. అత్యధిక వ్యవసాయ ఉత్పత్తి గ్రామీణ ప్రాంతాల్లోనే జరుగుతుందన్నారు. రసాయన వ్యవసాయం కంటే ప్రకృతి వ్యవసాయమే సంపూర్ణ వ్యవసాయ విధానమే శ్రేయస్కరమన్నారు. ప్రకృతి వ్యవసాయం నేల పునరుత్పత్తి , నీరు, గాలి నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుందని, పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని ఉత్పత్తి చేస్తుందన్నారు. సమగ్ర వ్యవసాయంతో రైతులకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, పంటలతో అనుసంధానానికి ఎన్నో రంగాలు ఉన్నాయన్నారు. ముఖ్యంగా రైతులు వారి ప్రాంతంలో ఉన్న వనరులను అనుసరించి వ్యవసాయంపై శ్రద్ధ చూపితే మన సాంప్రదాయ వృత్తిగా ఉన్న వ్యవసాయంలో అంటూనే కుటుంబానికి అదనపు ఆదాయం , ఉపాధి కలిగించుకోవచ్చన్నారు. పాడి పశువులు , సేంద్రియ ఎరువుల ఉత్పత్తి , కూరగాయల సాగు వంటివి సమగ్ర వ్యవసాయ విధానంలో రైతులకు అనుకూలమైనవన్నారు. సమగ్ర వ్యవసాయ విధానంతో రైతుకి ఆర్థిక అభివృద్ధి, వ్యవసాయానికి ప్రగతి అన్నారు. ఇట్టి కార్యక్రమంలో స్వదేశీ జాగరన్ మంచ్ తెలంగాణ ప్రాంత మహిళా సహా ప్రముఖ్ బల్ల స్వప్న, రాష్ట్ర సేవికాసమితి జిల్లా కార్యవాహిక బూర్ల విజయలక్ష్మి, సహా కార్య వాహిక కామారపు మంజుల, నగర కార్యవాహిక కళ్లెం కవిత, పాక సంధ్య రేఖా, రమ, స్వరూపరాణి , ప్రముఖ న్యూట్రిషనిస్ట్ కాచం దీప్తి లతో పాటు కరీంనగర్ డైరీ చైర్మన్, స్వదేశీ మేళ కన్వీనర్ రాజేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.

భారత సంస్కృతికి విశేష కృషిచేసిన అహల్యా బాయి హోల్కర్

కరీంనగర్, ఫిబ్రవరి 14(భారత శక్తి):

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మహిళలు మూల స్తంభాలాంటివారని, నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని , గృహిణిగా బాధ్యతలను నిర్వర్తిస్తూనే పలు వ్యాపారాలు, వృత్తులు, ఉద్యోగాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని, పురుషులకు దీటుగా అన్ని రంగాల్లో ప్రతిభ చాటుతూ విజయాల బాటలో పయనిస్తున్నారని మహిళా సాధికారత , వ్యాపార వ్యవస్థాపకత కమిటీ చైర్మన్ బెల్లం మాధవి తెలిపారు. స్వదేశీ మేళా ప్రోగ్రాం లో భాగంగా శుక్రవారం మహిళా ఆర్థిక స్వాలంబన, అభివృద్ధి అంశంపై స్వశక్తి మహిళలకు సెమినార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె ముఖ్య వక్తగా హాజరై మాట్లాడుతూ మహిళలు చిన్న తరహా, కుటీర పరిశ్రమల వంటివి స్థాపించి తాము స్వయం ఉపాధి పొందడమే కాకుండా ఇతరులకు ఉపాధి కల్పిస్తున్నారన్నారు. మహిళలకు ఆసక్తి ఉన్న రంగంలో ఉపాధి అవకాశాలను వెతుక్కుని స్థిరపడుతున్నారన్నారు. మహిళలను శక్తివంతం చేయడమే లక్ష్యంగా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయని, వివిధ రంగాల్లో అనేక మహిళా సాధికారత కార్యక్రమాలు విజయవంతంగా చేపడుతున్నామన్నారు. ప్రధానంగా సాధికారత అంటే బాధ్యత తీసుకునే సామర్ధ్యమని , జీవితంలో తమ ఎంపికలను తామే నిర్ణయించుకునే హక్కు మహిళలకు ఉందన్నారు. అలాగే లింగ సమానత్వం, లైంగిక వేధింపులు, గృహహింస, చట్టపరమైన హక్కుల వంటి అంశాలపై అవగాహన పెంచడానికి , సాంప్రదాయ నైపుణ్యాలను అప్ గ్రేడ్ చేయడానికి, అదే సమయంలో కొత్త నైపుణ్యాలను ప్రోత్సహించడానికి వివిధ నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమాలలో మహిళలు తప్పకుండా పాల్గొనాలన్నారు. ఇవన్నీ కూడా మహిళలకు సాధికారత కల్పించే అంశాలేనన్నారు. మహిళలు అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకొని, జీవనోపాధిని మెరుగుపరచుకోవాలన్నారు. అనంతర కాలాంశంలో లోకమాత , ధీరవనిత అహల్యబాయి హోల్కర్ గురించి కేశవ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్, స్వదేశీ జాగరణ్ మంచ్ తెలంగాణ ప్రాంత మహిళా ప్రాంత మహిళా ప్రముక్ కళ్లెం స్వప్న మాట్లాడారు. భారతదేశ సంస్కృతికి అహల్య భాయి విశేష కృషి చేశారని, ఆమె చేసిన కృషికి గుర్తింపుగా ఆమె పేరిట శ్రీ శక్తి పురస్కారాన్ని నెలకొల్పారని చెప్పారు. పరిపాలన సమయంలో అహల్య భాయి సేవకు, దానధర్మాలకు మారుపేరుగా నిలిచారన్నారు. మమ్మదీయుల దాడుల్లో శిథిలమైన అనేక దేవాలయాలను పునర్నిర్మించారన్నారు. హిందూ ధర్మ పునరుత్తేజ్జానికి ఆమె విశేష కృషి చేశారన్నారు. శుక్రవారం మధ్యాహ్నం పాడిపంట, రైతు ఆర్థిక స్వాలంబన సెమినార్ కార్యక్రమానికి ముఖ్య వక్తగా ఎన్నారై సామ ఎల్లారెడ్డి హాజరై మాట్లాడారు. వ్యవసాయం అనేక విషయాల సమ్మిళితమని , ప్రధానంగా వ్యవసాయభివృద్ధి, గ్రామీణభివృద్ధితో దగ్గరి సంబంధం కలిగి ఉందన్నారు. గ్రామీణ జనాభాలో ఎక్కువమంది ఏదో రూపంలో వ్యవసాయంలో నిమగ్నమై ఉన్నారని తెలిపారు. అత్యధిక వ్యవసాయ ఉత్పత్తి గ్రామీణ ప్రాంతాల్లోనే జరుగుతుందన్నారు. రసాయన వ్యవసాయం కంటే ప్రకృతి వ్యవసాయమే సంపూర్ణ వ్యవసాయ విధానమే శ్రేయస్కరమన్నారు. ప్రకృతి వ్యవసాయం నేల పునరుత్పత్తి , నీరు, గాలి నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుందని, పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని ఉత్పత్తి చేస్తుందన్నారు. సమగ్ర వ్యవసాయంతో రైతులకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, పంటలతో అనుసంధానానికి ఎన్నో రంగాలు ఉన్నాయన్నారు. ముఖ్యంగా రైతులు వారి ప్రాంతంలో ఉన్న వనరులను అనుసరించి వ్యవసాయంపై శ్రద్ధ చూపితే మన సాంప్రదాయ వృత్తిగా ఉన్న వ్యవసాయంలో అంటూనే కుటుంబానికి అదనపు ఆదాయం , ఉపాధి కలిగించుకోవచ్చన్నారు. పాడి పశువులు , సేంద్రియ ఎరువుల ఉత్పత్తి , కూరగాయల సాగు వంటివి సమగ్ర వ్యవసాయ విధానంలో రైతులకు అనుకూలమైనవన్నారు. సమగ్ర వ్యవసాయ విధానంతో రైతుకి ఆర్థిక అభివృద్ధి, వ్యవసాయానికి ప్రగతి అన్నారు. ఇట్టి కార్యక్రమంలో స్వదేశీ జాగరన్ మంచ్ తెలంగాణ ప్రాంత మహిళా సహా ప్రముఖ్ బల్ల స్వప్న, రాష్ట్ర సేవికాసమితి జిల్లా కార్యవాహిక బూర్ల విజయలక్ష్మి, సహా కార్య వాహిక కామారపు మంజుల, నగర కార్యవాహిక కళ్లెం కవిత, పాక సంధ్య రేఖా, రమ, స్వరూపరాణి , ప్రముఖ న్యూట్రిషనిస్ట్ కాచం దీప్తి లతో పాటు కరీంనగర్ డైరీ చైర్మన్, స్వదేశీ మేళ కన్వీనర్ రాజేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.

About The Author