నేటి నుండి అరైవ్ అలైవ్–2026’ ఉద్యమం ప్రారంభం”
రాష్ట్ర వ్యాప్తంగా 10 రోజుల రోడ్డు భద్రతా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా :
రత్నాపూర్ కాండ్లి, నిర్మల్ పట్టణంలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం
హెల్మెట్, సీటుబెల్ట్ తప్పనిసరి ధరించాలి డ్రంక్ అండ్ డ్రైవ్, కేర్‌లెస్ డ్రైవింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్ అస్సలు చేయొద్దు
గ్రామస్థులతో రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించిన జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల.
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించి ప్రజల ప్రాణ భద్రతను కాపాడాలనే లక్ష్యంతో తెలంగాణ పోలీస్, రవాణా, ఆరోగ్య శాఖలు సంయుక్తంగా “అరైవ్ అలైవ్ – 2026” పేరిట ఈరోజు నుండి రాష్ట్ర స్థాయి 10 రోజుల రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి.
ఈ కార్యక్రమం *తెలంగాణ డీజీపీ శ్రీ శివధర్ రెడ్డి * పర్యవేక్షణలో నిర్వహించబడుతుంది.
ఈ కార్యక్రమంలో భాగంగా, ఈరోజు నిర్మల్ గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలోని రత్నాపూర్ కాండ్లి గ్రామంలో జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపీఎస్ హాజరై గ్రామీణ రోడ్డు భద్రత దినం సందర్భంగా గ్రామస్థులతో సమావేశం నిర్వహించారు.అంతే కాకుండా నిర్మల్ పట్టణంలోని గెలాక్సీ ఫంక్షన్ హాల్ లో ఆటో డ్రైవర్లకు, ఇంకా మిగతా వాహన దారులకు, ఈ రెండు ప్రదేశాల్లో ప్రజలకు ఈ రోడ్డు భద్రత నియమాల గురించి క్లుప్తంగా వివరించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ...*
హెల్మెట్ వినియోగం, సీటుబెల్ట్ ప్రాధాన్యత, ఫస్ట్ ఎయిడ్ వినియోగం, డిఫెన్సివ్ డ్రైవింగ్ నియమాల గురించి కూలంకుషంగా వివరించారు. అంతే కాకుండా ప్రమాద బాధిత కుటుంబాలతో పరస్పర చర్చలు,అవగాహన కల్పించి, రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించారు.జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని, ట్రాఫిక్ నిబంధనలు గౌరవించి తమ ప్రాణ భద్రతతో పాటు ఇతరుల భద్రతకు కూడా సహకరించాలని జిల్లా ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ అవగాహన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల తో పాటు నిర్మల్ ఏఎస్పీ సాయి కిరణ్, టౌన్ ఇన్స్పెక్టర్ నైలు, రూరల్ ఇన్స్పెక్టర్ కృష్ణ, ఎస్.బి. ఇన్స్పెక్టర్ సమ్మయ్య, రవాణా ఇన్స్పెక్టర్,ఎస్ఐ లు, పోలీసు సిబ్బంది,వైద్యాధికారులు,గ్రామాధికారులు, గ్రామస్థులు, ఆటో డ్రైవర్లు, మిగతా వాహన దారులు,ప్రజలు పాల్గొన్నారు.
