న్యాయమూర్తి పై దాడి న్యాయ వ్యవస్థను ఆవమానించినట్టే: కరీంనగర్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మహేందర్ రెడ్డి

కరీంనగర్, ఫిబ్రవరి 14(భారత శక్తి): రాష్ట్రంలో, దేశంలో నిత్యం ఏదో ఒక చోట న్యాయవాదుల పై, న్యాయమూర్తులపై దాడులు జరగడం బాధాకరమని, ఈ దాడులు న్యాయ వ్యవస్థ పైనే నమ్మకం కోల్పోయేలా చేయడమే కాకుండా న్యాయ వ్యవస్థనే అవమానించేలా ప్రవర్తిస్తున్నారని, వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలని కరీంనగర్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బేతి మహేందర్ రెడ్డి ఆవేదనతో కోరారు. రంగారెడ్డి జిల్లా కోర్టులో 9వ అదనపు డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు మహిళ న్యాయమూర్తి పై గురువారం కరణ్ సింగ్ అనే కరడుగట్టిన నేరస్థుడు దాడి చేయడాన్ని నిరసిస్తూ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బేతి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కోర్టు న్యాయవాదులు తమ విధులను బహిష్కరించి కోర్టు ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్బంగా బేతి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ న్యాయాన్ని పరిరక్షించే వాళ్ల పై నిత్యం దాడులు చేయడం సమయానికి మంచిది కాదని, సమాజంలో ఏ వ్యవస్థ పైన నమ్మకం ఉంది అనుకుంటే అది ఒక న్యాయవ్యవస్థ పైనే ఉందనే విషయం ప్రభుత్వాలు గమనించాలని, లేనిపక్షంలో ఈ దాడులు ఇలాగే జరుగుతుంటే న్యాయ వ్యవస్థ పై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని వమ్ము చేసే విధంగా కొంతమంది వ్యవహరిస్తున్న తీరును ప్రభుత్వాలు గమనించి అరికట్టే విధంగా న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావాల్సిందేనని ఆయన ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు టి.రఘువీర్, లైబ్రరీ సెక్రటరీ కే. రాజేందర్, సేనియర్, జూనియర్ కార్యవర్గ సభ్యులు సుంకే దేవకిషన్, బెజ్జంకి శ్రీకాంత్ తో పాటు పెంచాల ప్రభాకర్ రావు, సిరికొండ శ్రీధర్ రావు, బలరాం, సంపత్, రమేష్, శ్రీనివాస్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

న్యాయమూర్తి పై దాడి న్యాయ వ్యవస్థను ఆవమానించినట్టే: కరీంనగర్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మహేందర్ రెడ్డి

కరీంనగర్, ఫిబ్రవరి 14(భారత శక్తి):
రాష్ట్రంలో, దేశంలో నిత్యం ఏదో ఒక చోట న్యాయవాదుల పై, న్యాయమూర్తులపై దాడులు జరగడం బాధాకరమని, ఈ దాడులు న్యాయ వ్యవస్థ పైనే నమ్మకం కోల్పోయేలా చేయడమే కాకుండా న్యాయ వ్యవస్థనే అవమానించేలా ప్రవర్తిస్తున్నారని, వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలని కరీంనగర్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బేతి మహేందర్ రెడ్డి ఆవేదనతో కోరారు. రంగారెడ్డి జిల్లా కోర్టులో 9వ అదనపు డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు మహిళ న్యాయమూర్తి పై గురువారం కరణ్ సింగ్ అనే కరడుగట్టిన నేరస్థుడు దాడి చేయడాన్ని నిరసిస్తూ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బేతి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కోర్టు న్యాయవాదులు తమ విధులను బహిష్కరించి కోర్టు ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్బంగా బేతి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ న్యాయాన్ని పరిరక్షించే వాళ్ల పై నిత్యం దాడులు చేయడం సమయానికి మంచిది కాదని, సమాజంలో ఏ వ్యవస్థ పైన నమ్మకం ఉంది అనుకుంటే అది ఒక న్యాయవ్యవస్థ పైనే ఉందనే విషయం ప్రభుత్వాలు గమనించాలని, లేనిపక్షంలో ఈ దాడులు ఇలాగే జరుగుతుంటే న్యాయ వ్యవస్థ పై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని వమ్ము చేసే విధంగా కొంతమంది వ్యవహరిస్తున్న తీరును ప్రభుత్వాలు గమనించి అరికట్టే విధంగా న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావాల్సిందేనని ఆయన ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు టి.రఘువీర్, లైబ్రరీ సెక్రటరీ కే. రాజేందర్, సేనియర్, జూనియర్ కార్యవర్గ సభ్యులు సుంకే దేవకిషన్, బెజ్జంకి శ్రీకాంత్ తో పాటు పెంచాల ప్రభాకర్ రావు, సిరికొండ శ్రీధర్ రావు, బలరాం, సంపత్, రమేష్, శ్రీనివాస్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

About The Author