మహిళల భద్రత హక్కు.. సదుపాయం కాదు

15 రోజుల్లో 88 మంది ఆకతాయిల అరెస్టు: మల్కాజిగిరి డీసీపీ ఉషారాణి

మహిళల భద్రత హక్కు.. సదుపాయం కాదు

మల్కాజిగిరి: 

మహిళలు, బాలికలను వేధించే వారిపై కఠిన చర్యలు తప్పవని మల్కాజిగిరి ఉమెన్ సేఫ్టీ డీసీపీ ఉషారాణి హెచ్చరించారు. వేధింపులకు గురయ్యే వారు భయం వీడి ఫిర్యాదు చేయాలని సూచించారు. గడిచిన 15 రోజుల్లో షీ టీమ్స్ చేపట్టిన చర్యల వివరాలను ఆమె వెల్లడించారు.

నిఘా నీడలో ఆకతాయిలు
బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మెట్రో, విద్యాసంస్థలు, మార్కెట్ల వద్ద షీ టీమ్స్ నిరంతరం నిఘా ఉంచుతున్నాయి. గత పక్షం రోజుల్లో మహిళలను వేధిస్తున్న *88 మందిని (73 మంది మేజర్లు, 15 మంది మైనర్లు)* పట్టుకున్నారు.
 * *ఫిర్యాదులు:* మొత్తం 106 ఫిర్యాదులు అందగా.. అందులో ప్రత్యక్ష వేధింపులు (53), ఫోన్ కాల్స్ (28), సోషల్ మీడియా వేధింపులు (25) ఉన్నాయి.

 *చర్యలు:*9 క్రిమినల్ కేసులు, 20 పెట్టీ కేసులు నమోదు చేయగా.. 66 మందికి కౌన్సెలింగ్ ఇచ్చారు.

 మెట్రో తనిఖీలు: మహిళా కోచ్‌లలో ప్రయాణించిన ఐదుగురు పురుషులకు జరిమానా విధించారు.

వెలుగులోకి వచ్చిన ప్రధాన కేసులు
 బ్లాక్ మెయిలింగ్: యువతి వ్యక్తిగత ఫోటోలు, వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తూ, ఆమె కుటుంబాన్ని దూషిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

 వేధింపులు:  పెళ్లయిన విషయాన్ని దాచి, తోటి ఉద్యోగినిని ప్రేమ పేరుతో వేధిస్తూ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరించిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు.

 మోసం:* పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబర్చుకుని, ఆపై మోసం చేసిన వ్యక్తిని బాధితురాలి ఫిర్యాదుతో అరెస్టు చేశారు.

అవగాహన.. కౌన్సెలింగ్
మల్కాజిగిరి పరిధిలో 41 అవగాహన కార్యక్రమాల ద్వారా 3,097 మందికి చట్టాలపై అవగాహన కల్పించారు. పట్టుబడిన ఈవ్ టీజర్లకు ఎల్బీనగర్ క్యాంపు కార్యాలయంలో కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు.

సహాయం కోసం సంప్రదించండి:
> వేధింపులు ఎదుర్కొనే వారు మల్కాజిగిరి వాట్సాప్ నంబరు *8712662111* కు లేదా ఎల్బీనగర్ (*8712662602), ఉప్పల్ (8712665299), బేగంపేట (8712665300), వనస్థలిపురం (8712662604*) నంబర్లకు ఫిర్యాదు చేయవచ్చు.

About The Author