మధుయాష్కి చొరవ: బృందావన్ మిడోస్‌కు రూ. 35 లక్షలు
కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణానికి నిధుల మంజూరు
ఎల్బీనగర్ :
ఏళ్ల తరబడి రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న సాహెబ్‌నగర్ డివిజన్ బృందావన్ మిడోస్ కాలనీ వాసుల గోడును మాజీ ఎంపీ, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ ఆలకించారు. ఆయన ప్రత్యేక చొరవతో కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ. 35 లక్షల నిధులు మంజూరయ్యాయి.
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మధుయాష్కి
త్వరలో మారనున్న కాలనీ రూపురేఖలు
మధుయాష్కి కృషితో నిధులు మంజూరు కావడంతో కాలనీలో త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి. ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారులను కూడా సీసీ రోడ్లుగా మార్చనున్నారు.
* తమ సమస్యపై సానుకూలంగా స్పందించి, నిధులు మంజూరు చేయించిన *మధుయాష్కి గౌడ్*కు కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు, ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.
About The Author
22 Apr 2026
