
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా :
వనల్ పడ్, గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటుచేసిన బాల్యవివాహాల నివారణపై విద్యార్థుల్లో అవగాహన కల్పించే కార్యక్రమం వనాల్ పడ్ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల ఎంపీ ఓ. చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్యవివాహాలు సమాజ అభివృద్ధికి అడ్డంకిగా మారుతున్నాయని, విద్యార్థులు విద్యపై దృష్టి పెట్టి భవిష్యత్తును సుసంపన్నంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శి గాయత్రి మాట్లాడుతూ బాల్యవివాహాల వల్ల కలిగే దుష్పరిణామాలను వివరించారు.ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.