మహిళా సాధికారత కేంద్రం వారు భేటీ బచావో బేటి పడావో కార్యక్రమంలో అవగాహన సదస్సు

మహిళా సాధికారత కేంద్రం వారు భేటీ బచావో బేటి పడావో కార్యక్రమంలో అవగాహన సదస్సు

కామారెడ్డి :

బుధవారం రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్ కార్యక్రమంలో భాగంగా జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో పనిచేస్తున్న జిల్లా మహిళా సాధికారత కేంద్రం వారు భేటీ బచావో బేటి పడావో కార్యక్రమంలో అవగాహనలో భాగంగా స్టాల్ ని ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల   బేటి బచావో బేటి పడావో పథకానికి సంబంధించి వివరాలు, జిల్లా మహిళా సాధికారత కేంద్రం వారు జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన అవగాహన సదస్సులు, ఉపాధి కార్యక్రమాలు మొదలగు వాటి గురించి వివరించారు. సఖి కి సంబంధించిన సేవలు చైల్డ్ హెల్ప్ లైన్ కి సంబంధించిన సేవలను గురించి వివిధ జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులకు, పర్యాటకులకు వివరించడం జరుగుతుంది. ఈ స్టాల్ ని రాష్ట్ర మహిళా కమిషన్ నెంబర్ అయినా సుధామ లక్ష్మీ  సందర్శించి జిల్లా మహిళా సాధికారత కేంద్రం వారు నిర్వహిస్తున్న పనులను అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా సాధికార కేంద్రం సిబ్బంది సఖి కేంద్రం సిబ్బంది బాలరక్ష భవన్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.

About The Author

Related Posts