వెల్లుట్ల వెంకటాపూర్ గ్రామంలో శివాజీ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న బారాస నేతలు
కామారెడ్డి:
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల పరిధిలోని వెలుట్ల వెంకటాపూర్ గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్టాపన నిర్వహించారు. ఈ సందర్భంగా శుక్రవారం గ్రామంలో ప్రజల సహకారంతోపాటు గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ గొల్లపల్లి రాజు ఆర్థిక సహాయంతో శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ తో పాటు గ్రామస్తులు బి ఆర్ఎస్ నాయకులకు ఆహ్వానం అందించిన సందర్భంగా వారు హాజరయ్యారు.
ఈ సందర్భంగా బారాస ఎల్లారెడ్డి పట్టణ అధ్యక్షుడు ఆదిమూలం సతీష్ కుమార్ మాట్లాడుతూ, ప్రజలు ఐకమత్యంతో విగ్రహ ప్రతిష్టాపన నిర్వహించడం ఎంతో సంతోషకరమని ఆయన గ్రామ ప్రజలను కొనియాడారు. చత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్టాపనకు కొండాపూర్ మైలారం పీఠాధిపతులను ఆహ్వానించి వారి ఆధ్వర్యంలో విగ్రహ ఆవిష్కరణ చేయడం ఎంతో సంతోషకరమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి సొసైటీ మాజీ అధ్యక్షులు నర్సింలు, కామారెడ్డి జిల్లా రేషన్ డీలర్ సంఘం అధ్యక్షులు నాగం సురేందర్, నెల్లి గోపాల్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.
