ఘనంగా కోదండరాముని ద్వి దశాబ్ది ఉత్సవం

ఖమ్మం ప్రతినిది (భారత శక్తి న్యూ ), పిబ్రవరి 12: రాపల్లి గ్రామంలో కొలువు దీరిన శ్రీ కోదండరామ స్వామి ద్వి దశాబ్ది ఉత్సవాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రతిష్ట జరిగి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆలయంలో వేద పండితులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ దేవతలైన ముత్యాలమ్మతల్లి, బొడ్రాయి, దేవాలయ ప్రాంగణంలో కొలువుదీరిన శ్రీ ఆంజనేయ స్వామి, దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలు తెల్లవారు జామునే ప్రారంభమయ్యాయి. పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. శ్రీ పాండురంగ శాస్త్రి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం గ్రామ పంచాయితీ కార్యాలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామానికి చెందిన ఏనుగు గాంధీ వితరణ చేయగా ఈ కార్యక్రమాన్ని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు జమ్ముల జితేందర్రెడ్డితో పాటు గ్రామ ప్రముఖులు ప్రారంభించారు. రాజకీయాలకు అతీతంగా గ్రామస్తులు ఐక్యంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవాలయ పురోభివృద్ధికి గ్రామస్తులు పూజా కార్యక్రమాలకు హాజరైన భక్తులు విరాళాలు అందజేశారు. శ్రీ కోదండ రామాలయ కమిటీ ఛైర్మన్ మందడపు చంద్రశేఖర్రావు, కమిటీ సభ్యులు కార్యక్రమ నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా నిర్వహించారు. ఇటీవల కాలంలో గ్రామంలో ఇంతటి భక్తి కార్యక్రమం జరగకపోవడం విశేషం.

ఘనంగా కోదండరాముని ద్వి దశాబ్ది ఉత్సవం

ఖమ్మం ప్రతినిది (భారత శక్తి న్యూ ), పిబ్రవరి 12:

రాపల్లి గ్రామంలో కొలువు దీరిన శ్రీ కోదండరామ స్వామి ద్వి దశాబ్ది ఉత్సవాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రతిష్ట జరిగి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆలయంలో వేద పండితులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ దేవతలైన ముత్యాలమ్మతల్లి, బొడ్రాయి, దేవాలయ ప్రాంగణంలో కొలువుదీరిన శ్రీ ఆంజనేయ స్వామి, దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలు తెల్లవారు జామునే ప్రారంభమయ్యాయి. పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. శ్రీ పాండురంగ శాస్త్రి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం గ్రామ పంచాయితీ కార్యాలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామానికి చెందిన ఏనుగు గాంధీ వితరణ చేయగా ఈ కార్యక్రమాన్ని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు జమ్ముల జితేందర్రెడ్డితో పాటు గ్రామ ప్రముఖులు ప్రారంభించారు. రాజకీయాలకు అతీతంగా గ్రామస్తులు ఐక్యంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవాలయ పురోభివృద్ధికి గ్రామస్తులు పూజా కార్యక్రమాలకు హాజరైన భక్తులు విరాళాలు అందజేశారు. శ్రీ కోదండ రామాలయ కమిటీ ఛైర్మన్ మందడపు చంద్రశేఖర్రావు, కమిటీ సభ్యులు కార్యక్రమ నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా నిర్వహించారు. ఇటీవల కాలంలో గ్రామంలో ఇంతటి భక్తి కార్యక్రమం జరగకపోవడం విశేషం.

About The Author