మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కు ఘనంగా నివాళులు
ఎల్బీనగర్:
మహేశ్వరం నియోజకవర్గం రామకృష్ణాపురం డివిజన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వినర్, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ బండి మధుసూదన్ రావ్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135 వ జయంతి సందర్బంగా ఆర్కేపురం కాలనీ చౌరస్తాలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.ఈ సందర్భంగా ఆర్కేపురం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పున్న.గణేష్ నేత మాట్లాడుతూ, న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, సంఘ సంస్కర్తగా, భారత రాజ్యాంగ నిర్మాతగా భారతీయుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే మహనీయుడు డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్. అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ.. దళితులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు, దేశంలో అన్ని మతాలు, తెగలు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన కులాలు తదితర వర్గాలకు సమ న్యాయం జరిగేలా, వారి హక్కులకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు, సార్వభౌమాధికారాన్ని దక్కించుకొనేందుకు వీలుగా అంబేద్కర్ రాజ్యంగాన్ని రూపొందించారు. వారి దేశ సేవలు మరువలేనివి వారి జయంతి స్మరించుకుంటూ వారు వేసిన బాటలో వారి ఆశయ సాధన కొరకు ప్రతి ఒక్క పౌరుడు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు గట్ల రవీంద్ర, శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయం చైర్మన్ తలాటి రమేష్ నేత, శ్రీ ఖిల్లా మైసమ్మ అమ్మవారి దేవాలయం చైర్మన్ సురేష్ కుమార్ , బొడ్డుపల్లి మహేందర్, సాయికుమార్, శ్యాంసుంధర్ రావ్, మంచుకొండ శ్రీనివాస్ ,పి శ్రీనివాస్, పెద్దవూర సైదులు, పగిళ్ల భూపాల్ రెడ్డి, యాదవ రెడ్డి, జెల్ల జగన్నాథం, పగడాల ఎల్లన్న, వెంకట రమణారెడ్డి, లింగస్వామి గౌడ్, రామకృష్ణ గౌడ్ , మహమ్మద్, సందీప్, జహంగీర్, విప్లవ రెడ్డి, నరసింహ, యాదయ్య, శ్రీనివాస్ గౌడ్, విద్యాసాగర్ రావు, హంస భాస్కర్, నగేష్,పెద్ద ఎత్తున అంబేద్కర్ సంఘం నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు
