ప్రజలను నిరాశపరిచిన బడ్జెట్: సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి

కరీంనగర్, జనవరి 1(భారత శక్తి): కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ ప్రజానీకాన్ని నిరాశపరచిందని సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. అంకెల గారడితో రంకెలు చూపించి ఆశల పల్లకిలో ఊరేగించి బడ్జెట్ పెంచి చూపించినప్పటికీ లక్షల కోట్ల వడ్డీ చెల్లింపులకు చూపడం దిగజారిన దేశ ఆర్థిక పరిస్థితికి నిదర్శనమని విమర్శించారు. ఆదాయ పన్నులు 12 లక్షల వరకు మినహాయింపు అనడం మధ్యతరగతి ప్రజలను వేతన జీవులను మభ్యపెట్టడానికేనని, 4 లక్షలు ఆదాయం దాటితే ఐదు శాతం వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. కష్టజీవులకు ఈ బడ్జెట్ తో ఒరిగిందేమీ లేదని పెట్రోల్, డీజిల్ ధరలపై జిఎస్టి విధించకుండా కేంద్ర ప్రభుత్వం దోచుకుంటుందని,వ్యవసాయం,విద్యా,వైద్యం కి అధిక నిధులు కేటాయించడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, పారిశ్రామికవేత్తలకు, సంపన్నులకు కార్పొరేట్లకు అనుకూలంగా కేంద్రం ఉందని, ఈ బడ్జెట్ దేశ ప్రజలను తీవ్రంగా నీరాస పరిచిందన్నారు. కరీంనగర్ జిల్లా అభివృద్ధికి ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్లో నిధులు కేటాయించుకోలేకపోవడంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పూర్తిగా విఫలం చెందాడని, కోట్ల రూపాయలు నిధులు ఆశించిన జిల్లా ప్రజలకు బడ్జెట్ ఆశాభంగం కలిగిందని వెంకటస్వామి తెలిపారు.

ప్రజలను నిరాశపరిచిన బడ్జెట్: సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి

కరీంనగర్, జనవరి 1(భారత శక్తి):
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ ప్రజానీకాన్ని నిరాశపరచిందని సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి ఒక ప్రకటనలో తెలిపారు.
అంకెల గారడితో రంకెలు చూపించి ఆశల పల్లకిలో ఊరేగించి బడ్జెట్ పెంచి చూపించినప్పటికీ లక్షల కోట్ల వడ్డీ చెల్లింపులకు చూపడం దిగజారిన దేశ ఆర్థిక పరిస్థితికి నిదర్శనమని విమర్శించారు. ఆదాయ పన్నులు 12 లక్షల వరకు మినహాయింపు అనడం మధ్యతరగతి ప్రజలను వేతన జీవులను మభ్యపెట్టడానికేనని, 4 లక్షలు ఆదాయం దాటితే ఐదు శాతం వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. కష్టజీవులకు ఈ బడ్జెట్ తో ఒరిగిందేమీ లేదని పెట్రోల్, డీజిల్ ధరలపై జిఎస్టి విధించకుండా కేంద్ర ప్రభుత్వం దోచుకుంటుందని,వ్యవసాయం,విద్యా,వైద్యం కి అధిక నిధులు కేటాయించడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, పారిశ్రామికవేత్తలకు, సంపన్నులకు కార్పొరేట్లకు అనుకూలంగా కేంద్రం ఉందని, ఈ బడ్జెట్ దేశ ప్రజలను తీవ్రంగా నీరాస పరిచిందన్నారు. కరీంనగర్ జిల్లా అభివృద్ధికి ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్లో నిధులు కేటాయించుకోలేకపోవడంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పూర్తిగా విఫలం చెందాడని, కోట్ల రూపాయలు నిధులు ఆశించిన జిల్లా ప్రజలకు బడ్జెట్ ఆశాభంగం కలిగిందని వెంకటస్వామి తెలిపారు.

About The Author