నేను బెంజిలో తిరిగిన గంజికే కనెక్ట్ అవుతా..
- టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

సంగారెడ్డి :
:
ఒకప్పుడు గంజి తాగి బతికిన వాళ్ళు నేడు బెంజ్ కార్ లో తిరుగుతూ ఒకప్పటి తమ స్థాయిని సైతం మర్చిపోవడం కామన్ గా మారిందాన్ని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఆదివారం సంగారెడ్డిలో ఆయన మాట్లాడుతూ... కష్టపడిన రోజులను నెమరేసుకుంటూ గంజి బెంజి కథను చెప్పారు. ఒకప్పుడు గంజి నీళ్లు తాగిన వాళ్ళు తర్వాత రోజుల్లో బెంజ్ కార్ లో తిరుగుతూ తమ స్థాయిని మర్చిపోవడం సర్వసాధారణమైపోయిందని ఇదే ఇప్పుడు రాష్ట్రంలో దేశంలో కామన్ గా మారిందని నవ్వుతూ చమత్కరించారు. కానీ తన జీవన విధానాన్ని తెలుపుతూ తాను ఒకప్పుడు గంజి నీళ్లు తాగాలని బెంజి ఎక్కిన గంజికే కనెక్ట్ అవుతానని కరాకండిగా తేల్చి చెప్పారు. ఇష్టం లేకున్నా బెంజి ఎక్కుతానని కానీ గంజికే ఎక్కువ కనెక్ట్ అవుతానని జగ్గారెడ్డి కథలో ఉదాహరించారు. ప్రతి ఒక్కరు నాటి నేటి స్థాయిలను మర్చిపోవద్దని హితవు పలికారు.
