కమీషనరేట్ లో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు
కరీంనగర్ :

తెలంగాణ వీర వనిత, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు కరీంనగర్ పోలీసు కమీషనరేట్ కార్యాలయములో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ కమిషనరేట్ కేంద్రంలోని అస్త్ర కన్వెన్షన్ హాలు నందు ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భముగా సీపీ మాట్లాడుతూ నిరంకుశంగా వ్యవహరించిన రజాకార్లకు, జమీందార్లకు, దొరలకు వ్యతిరేఖంగా మొక్కవోని ధైర్యంతో ఐలమ్మ ఎదిరించిన తీరు అందరికీ ఆదర్శమని ఆమె చేసిన పోరాటాలను కొనియాడారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీలు వెంకటరమణ, ఏసీపీలు మాధవి, యాదగిరిస్వామి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
About The Author
13 Jun 2026
