
జయశంకర్ భూపాలపల్లి :
భూపాలపల్లి జిల్లా కోర్టు సిబ్బందికి, న్యాయవాదులకు మరియు జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గౌరవనీయులు సి.హెచ్. రమేష్ బాబు గారు. అడ్వొకేట్స్ బార్ అసోసియేషన్ మరియు కోర్టు సిబ్బంది సమక్షంలో వారు కేక్ కట్ చేసినారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ భగవంతుని ఆశీస్సులతో కొత్త సంవత్సరంలో అందరూ బాగుండాలని అకాక్షించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీ ఏ. నాగరాజ్ గారు, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీ ఎస్.ఆర్. దిలీప్ కుమార్ నాయక్ గారు, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి జి. అఖిల గారు, అడ్వొకేట్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు వి. శ్రీనివాస చారి, ఉపాధ్యక్షులు బల్లా మహేందర్, ప్రధాన కార్యదర్శి వి. శ్రావణ్ రావు, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ పుప్పాల శ్రీనివాస్, అడిషనల్ పి.పి. ఎం.డి.రఫీక్, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ ఇందారపు శివకుమార్, మంగళంపల్లి రాజ్ కుమార్, రత్నం కిరణ్, ప్రియాంక, సంధ్య తదితరులు పాల్గొన్నారు.