బాల్య వివాహాల వల్ల బాలికల భవిష్యత్ నాశనం అవుతుంది
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి- ఫర్విన్ కౌసర్
సూర్యాపేట :
బాల్యవివాహాల వల్ల బాలికల జీవితాలు చిన్నవయసులోనే దుర్భరమవుతున్నాయని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పర్వీన్ కౌసర్ అన్నారు.గురువారం సూర్యాపేట పట్టణ కేంద్రలోని ఆర్ టి సి బస్టాండ్ ప్రాంగణంలో గురువారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బాల్య విహహ్ ముక్ట్ అభియాన్ కార్యక్రమం కు ముఖ్య అతిధిగా ఆమె పాల్గొని మాట్లాడారు.18 సంవత్సరాలు నిండని బాలికలు, 21 సంవత్సరాలు నిండని బాలుర వివాహాలు చట్టవిరుద్ధమని, అటువంటి వివాహాలు నిర్వహించిన వారిపై బాల్య వివాహాల నిరోధక చట్టం–2006 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని,
బాల్య వివాహాల వల్ల బాలికల విద్యకు ఆటంకం కలుగుతుందని, ఆరోగ్య సమస్యలు, మాతృ మరణాలు, శిశు మరణాలు పెరిగే ప్రమాదం ఉందని తెలిపారు.ప్రిన్సిపల్ జూనియర్ జడ్జి రజిత గోపుమాట్లాడుతూ బాల్య వివాహాల సమాచారం తెలిసిన వెంటనే చైల్డ్‌లైన్ 1098, పోలీస్ స్టేషన్ 100, లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని, గ్రామాలలో బాల్య వివాహలను అరికట్టెందుకు గ్రామ సర్పంచులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, పాఠశాల ఉపాధ్యాయులు ప్రజలకు అవగాహన కల్పించి బాల్య వివాహాలను నివారించాలని తెలిపారు.ఫస్ట్ ఎడిషనల్ జూనియర్ జడ్జి అపూర్వ రవళి మాట్లాడుతూ బాలికలను చదివించి ఉన్నత స్థానాలకు చేరేంత వరకు వివాహం చేయకూడదని సూచించారు.సెకండ్ ఎడిషనల్ జూనియర్ జడ్జి మంచాల మమతా మాట్లాడుతూ 18 సం ల లోపు ఆడపిల్లలకు వివాహం చేస్తే 2 సం ల శిక్ష, 1 లక్ష రూపాయలు జరిమానా విధించటం జరుగుతుందని ప్రతి ఒక్కరు చట్టాలను గౌరవించాలని కోరారు.
ఆర్టీసీ డి ఎం సునీత బాల్య వివాహాల వల్ల జరిగే నష్టాలను వివరించారు.
అంతకుముందు బాలసదన్ విద్యార్థినిలచే ఆర్థిక స్తొమత లేక ముగ్గురు ఆడపిల్లల తల్లి పెద్ద అమ్మాయి కి బాల్య వివాహం చేయటం ఆ వివాహాన్ని అధికారులు అడ్డుకోని ఆమెను బాల సదన్ లో చేర్పించి జాబ్ వచ్చేంత వరకు ప్రభుత్వమే చదివిస్తుందని ప్రదర్శించిన నాటకం అందరిని ఆకట్టుకుంది.ఈ కార్యక్రమం లో
డి. ఎల్. ఎస్. ఎ నామినేటెడ్ మెంబర్స్ గుంటూరు మధు గారు, నల్లపాటి మమత ,డిప్యూ టీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ బొల్లెద్దు వెంకటరత్నం, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ బట్టిపల్లి ప్రవీణ్ కుమార్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కే.ప్రియదర్శిని, పారా లీగల్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నా రు
