సంగారెడ్డి సదాశివపేట మున్సిపాలిటీలపై కాంగ్రెస్ జెండా ఎగరాలి - టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

సంగారెడ్డి సదాశివపేట మున్సిపాలిటీలపై కాంగ్రెస్ జెండా ఎగరాలి - టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

సంగారెడ్డి :
సంగారెడ్డి సదాశివపేట మున్సిపాలిటీలను కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర గార్డెన్ లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడారు. వచ్చే మూడేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని పార్టీ అభ్యర్థులు గెలిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని వెల్లడించారు. అభ్యర్థుల ఎంపిక కార్యకర్తలకే వదిలేస్తున్నట్లు పేర్కొన్నారు.  రిజర్వేషన్లకు అనుగుణంగా అభ్యర్థులను ఎంపిక చేసుకోవాలన్నారు.  గెలిచినా ఓడిన వారే పూర్తి బాధ్యత వహించాలన్నారు. ఇక కొత్తగా పార్టీలో చేరిన వారికి కౌన్సిలర్ టికెట్ ఇచ్చేది లేదన్నారు. పది సంవత్సరాలు అధికారంలో లేనప్పుడు పార్టీలో ఉన్న వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుందన్నారు. అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చిన వారికి రెండవ ప్రాధాన్యత ఉంటుందన్నారు.  నేను బిఆర్ఎస్ లో ఉన్నప్పుడు కాంగ్రెస్ రూలింగ్ లో ఉందని ఆ సమయంలో సంగారెడ్డి సదాశివపేట మున్సిపాలిటీల చైర్మన్ స్థానాలు టిఆర్ఎస్ గెలిచిందని స్పష్టం చేశారు. స్వయంకృషితో నేను బిజెపి నుంచి సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్గా గెలిచినానన్నారు. జీవితమంతా ప్రజాసేవకే అంకితమన్నారు. నేను మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి రానని ఎవరు పిలవద్దని సూచించారు. ఇక సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా కూడా సంతోష్ పేరు ప్రకటించారు. బీసీ అయిన బీసీ మహిళ అయినా జనరల్ అయినా కూనా సంతోష్ పేరే ఉంటుందన్నారు. వైస్ చైర్మన్ అభ్యర్థిగా షఫీ ఆఫీస్ పేరు ప్రకటించారు. ఒకవేళ ఎస్సీకి రిజర్వేషన్ అయితే మహేష్ లాల్ చైర్మన్ గా ఉంటాడన్నారు. ముఖ్యంగా కమిటీలు ఫైనల్ చేసిన అభ్యర్థులే పోటీల్లో నిలుస్తారని ప్రకటించారు. ఎవరు టికెట్ కోసం గాంధీభవన్  వెళ్లి పీసీసీ ప్రెసిడెంట్ ను కలిసి ఇబ్బంది పెట్టొద్దని సూచించారు. సదాశివపేట ఎస్సీ రిజర్వ్ అయితే చిరు చైర్మన్ అభ్యర్థిగా ఉంటాడని ప్రకటించారు. ఒకవేళ సొంత పార్టీ అభ్యర్థులను ఓడించే ప్రయత్నానికి పాల్పడితే ఎన్నికల సమయమని చూడకుండా సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. కార్యక్రమంలో టీజీఐసీ చైర్ పర్సన్ నిర్మల, కాంగ్రెస్ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About The Author

Related Posts