
సంగారెడ్డి :
సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలతో పాటు జూనియర్ కళాశాల నిర్మాణ పనులను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి దంపతులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాల కళాశాల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పాఠశాల కళాశాల మధ్య కాంపౌండ్ వాల్ నిర్మాణానికి 50 లక్షలు, ఉన్నత పాఠశాల కళాశాల గ్రౌండ్లో గ్రావెల్ కోసం మరో 20 లక్షలు, అదేవిధంగా ఉన్నత పాఠశాలలో కొత్తగా నిర్మించిన భవనానికి పెయింటింగ్ నిమిత్తం 10 లక్షల రూపాయలను తక్షణమే మంజూరు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఆరు నెలల కిందట బాలుర ఉన్నత పాఠశాల జూనియర్ కళాశాలను వేరు చేసి ప్రహారీ కూడా నిర్మించాలని ప్రతిపాదన చేసినట్లు పేర్కొన్నారు. కానీ ఇప్పటివరకు పనులు పూర్తి కాలేదని తెలిపారు. కేవలం బడ్జెట్ కారణంగానే పనులు ఆగిపోయాయని అధికారులు సమాధానం ఇవ్వడం జరిగిందన్నారు. 50 లక్షల నిధుల కోసం కలెక్టర్ కు టి జి ఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డికి లెటర్ హెడ్ పై విజ్ఞప్తి చేశామన్నారు. ఇక జూనియర్ కళాశాలలో సెకండ్ ఫ్లోర్ అదనపు తరగతి గదుల ఏర్పాటుకు సేఫ్టీ వాల్ సేఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు చేయాలని కళాశాల ప్రిన్సిపల్ జగ్గారెడ్డిని కోరారు. వీటికి సంబంధించి మరో 50 లక్షల నిధుల కోసం కలెక్టర్కు లేక ఇవ్వాలని జగ్గారెడ్డి సూచించారు. కళాశాలలో నిరుపయోగంగా శిథిలావస్థలో ఉన్న భవనాలను కూచివేసేందుకు కలెక్టర్కు సమాచారం అందించినట్లు తెలిపారు. కూల్చివేతలకు సంబంధించి ప్రొసీజర్ త్వరగా పూర్తిచేసే కూల్చివేతలు చేపట్టాలని అధికారులకు సూచించారు. జూనియర్ కళాశాల ఉన్నత పాఠశాల గ్రౌండ్ లో వర్షాలు పడినప్పుడల్లా నీళ్లు నిలుస్తున్నాయని ఉపాధ్యాయులు విద్యార్థులు జగ్గారెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. గ్రౌండ్ లెవెల్ కోసం 20 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని కలెక్టర్కు వినతి పత్రం అందించాలని జగ్గారెడ్డి సూచించారు. బాలుర ఉన్నత పాఠశాల మన ఊరు మనబడి కింద నిర్మించిన రెండు అంతస్తుల భవనాలు పెయింటింగ్ వేయాలని ఉపాధ్యాయులు జగ్గారెడ్డికి విజ్ఞప్తి చేశారు. పెయింటింగ్ కోసం పది లక్షల రూపాయల నిధులు ఇవ్వాలని జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేసినట్లు ఆయన వెల్లడించారు. విద్యా వ్యవస్థ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.