
ములుగు జిల్లా ప్రతినిధి :
ములుగు జిల్లాలోని పది మండలాల మీడియా మిత్రులకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించాలని జిల్లా ఎస్పీ శబరీష్.పి తెలిపినట్లు ములుగు ఎస్సైవెంకటేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని మండలాల వారీగా ఒక టీము ను తయారుచేసి, పది మండలాలకు గాను పది టీములతో కూడిన టోర్నమెంట్ ను జిల్లా కేంద్రంలోని బండారుపల్లి రోడ్డు ప్రక్కన ఉన్న తంగేడు మైదానంలో క్రికెట్ మ్యాచ్ ని నిర్వహించనున్నట్లు ఎస్సై తెలిపారు. ములుగు, మల్లంపల్లి రెండు మండలాలకు సంబంధించిన మీడియా ప్రతినిధులు ఎంతమంది ఉన్నారో వారు తమ తమ టీమ్ లను తమకు తెలియజేయాలని, టీముల మధ్య పోటీ నిర్వహించి గెలిచిన జట్టును మండల టీముగా పరిగణించడం జరుగుతుందని అన్నారు. మీడియా మిత్రులు సహకరించి వారి వారి టీమ్ లతో సంప్రదించాలని ఆయన కోరారు.