కిడ్స్ ఎలిమెంటరీ పాఠశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి :పిడిఎస్యూ , ఏ ఐ స్ బి , యూ స్ ఫ్ ఐ.నాయకులు

మంచిర్యాల, ఫిబ్రవరి 03(భారత శక్తి): మంచిర్యాల జిల్లా కేంద్రం లక్ష్మీ నగర్ లో ఎలాంటి అనుమతులు లేకుండా కిడ్స్ ఎలిమెంటరీ పాఠశాల పేరుతో బహిరంగంగా ప్రచారాలు చేసుకుంటున్నారని ఆరోపిస్తూ సోమవారం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. పిడిఎస్ యూ , యూ స్ ఫ్ ఐ , ఏ ఐ స్ బి నాయకులు డి శ్రీకాంత్, మిట్టపల్లి తిరుపతి, కనుకుంట్ల సన్నీ గౌడ్ మాట్లాడుతూ ఎలాంటి అనుమతులు లేకున్నాప్పటికీ బహిరంగంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకొని విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని , వెంటనే ఫ్లెక్సీలు తొలగించేలా ఆదేశాలు జారీచేసి పాఠశాల యాజమాన్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ పాఠశాల కి అనుమతులు ఇవ్వద్దని విద్యార్థి సంఘాలుగా సంబంధిత అధికారులను విజ్ఞప్తి చేస్తున్నాం లేని పక్షంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పాఠశాల ఎదుట ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. యాజమాన్యమే పూర్తి బాధ్యత తీసుకొని ఫ్లెక్సీలు తొలగించాలని లేదంటే విద్యార్థి సంఘాలుగా ఫ్లెక్సీలను తొలగిస్తామని చెప్పేసి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్ యూ నాయకులు కార్తీక్,ఐసబ్బి సుమన్ బచ్చలి ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.

కిడ్స్ ఎలిమెంటరీ పాఠశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి :పిడిఎస్యూ , ఏ ఐ స్ బి , యూ స్ ఫ్ ఐ.నాయకులు

మంచిర్యాల, ఫిబ్రవరి 03(భారత శక్తి):

మంచిర్యాల జిల్లా కేంద్రం లక్ష్మీ నగర్ లో ఎలాంటి అనుమతులు లేకుండా కిడ్స్ ఎలిమెంటరీ పాఠశాల పేరుతో బహిరంగంగా ప్రచారాలు చేసుకుంటున్నారని ఆరోపిస్తూ సోమవారం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. పిడిఎస్ యూ , యూ స్ ఫ్ ఐ , ఏ ఐ స్ బి నాయకులు డి శ్రీకాంత్, మిట్టపల్లి తిరుపతి, కనుకుంట్ల సన్నీ గౌడ్ మాట్లాడుతూ ఎలాంటి అనుమతులు లేకున్నాప్పటికీ బహిరంగంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకొని విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని , వెంటనే ఫ్లెక్సీలు తొలగించేలా ఆదేశాలు జారీచేసి పాఠశాల యాజమాన్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ పాఠశాల కి అనుమతులు ఇవ్వద్దని విద్యార్థి సంఘాలుగా సంబంధిత అధికారులను విజ్ఞప్తి చేస్తున్నాం లేని పక్షంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పాఠశాల ఎదుట ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. యాజమాన్యమే పూర్తి బాధ్యత తీసుకొని ఫ్లెక్సీలు తొలగించాలని లేదంటే విద్యార్థి సంఘాలుగా ఫ్లెక్సీలను తొలగిస్తామని చెప్పేసి హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పిడిఎస్ యూ నాయకులు కార్తీక్,ఐసబ్బి సుమన్ బచ్చలి ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.

About The Author