వడ్ల కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి
మార్కెట్ కమిటీ చైర్మన్ కనకయ్య
సిద్దిపేట:
రైతుల ప్రయోజనార్థం వడ్ల కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఐలాపురం కనకయ్య అధికారులను ఆదేశించారు. దౌల్తాబాద్, రాయపోల్ మండలాల ఐకేపీ ఏపీఎంలు, సీసీలు, సీఏలు, వ్యవసాయ అధికారులతో రైతు వేదికలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
రైతులు పండించిన ధాన్యాన్ని నిల్వ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కొనుగోళ్లు ఆలస్యం కాకుండా వెంటనే ప్రారంభించాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం, తేమ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలని, ఎలాంటి అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ధాన్యం తరలింపును వేగవంతం చేసి, కేంద్రాల్లో కవర్లు, తూకం యంత్రాలు, తాగునీరు వంటి మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. అధికారులు మాట్లాడుతూ కొనుగోలు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయని, త్వరలో కొనుగోళ్లు ప్రారంభిస్తామని తెలిపారు. రైతులు నాణ్యమైన ధాన్యం తీసుకురావాలని, తేమ శాతం ప్రమాణాల్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అధికారుల నిర్లక్ష్య ధోరణి

