ఇసుక మిస్‌యూజ్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా :
భూపాలపల్లి జిల్లా ఐడిఓసి కార్యాలయంలో ఎంపిడిఓలతో ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక రవాణా అంశంపై ఆయన సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ, ఇసుకను దుర్వినియోగం చేసినట్లయితే సంబంధితులపై క్రిమినల్ కేసులు పెట్టాలని కూపన్లలో అక్రమ సవరణలు చేసినా, అక్రమ రవాణా జరిగినా ఎంపిడిఓలు కఠినంగా వ్యవహరించాల్సిందేనని ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని, లబ్ధిదారులకు ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా ఇసుక సరఫరా జరగాలని సూచించారు. ఎక్కడైనా అక్రమాలు జరిగితే వెంటనే చర్యలు తీసుకుని నివేదికలు సమర్పించాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, గృహ నిర్మాణ శాఖ పిడి లోకిలాల్, ఎంపిడిఓలు తదితరులు పాల్గొన్నారు.
