లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో దోమ తెరలు పంపిణీ

ములుగు జిల్లా :
ములుగు లయన్స్ క్లబ్ ఎల్. సి వివేకానందపురం క్లబ్ ల ఆధ్వర్యంలో ములుగు మండలంలోని దేవగిరి పట్నం గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ కాలనీలోని నిరుపేద కుటుంబాలకు దోమతెరలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ ఎక్కంటి నరసింహారెడ్డి ములుగు లయన్స్ క్లబ్ సెక్రటరీ లయన్ చుంచు రమేష్, పి జడ్ సి సానికొమ్మ రవీందర్ రెడ్డి, ఫాస్ట్ ప్రెసిడెంట్ మేరుగు రమేష్, లయన్ సోమ నరసయ్య, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
