ముఖ్యమంత్రి సదర్మాట్ బ్యారేజి ప్రారంభోత్సవానికి సంబంధించి పకడ్బందీగా ఏర్పాట్లను పూర్తి చేయాలి:జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

ముఖ్యమంత్రి సదర్మాట్ బ్యారేజి ప్రారంభోత్సవానికి సంబంధించి పకడ్బందీగా ఏర్పాట్లను పూర్తి చేయాలి:జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

ఉమ్మడి ఆదిలాబాద్ :

 
సీఎం కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించి, అధికారులతో సమీక్షించిన కలెక్టర్.*
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఈ నెల 16వ తేదీన (శుక్రవారం) మామడ మండలం పొన్కల్ గ్రామంలో నిర్మించిన సదర్మాట్ బ్యారేజీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతున్నందున, ఈ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పరిశీలించారు.
    ఈ సందర్భంగా కలెక్టర్ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. సదర్మాట్ బ్యారేజి  ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏర్పాట్ల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. బ్యారేజి ప్రాంగణం పరిశీలించి, ఏర్పాట్లపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. హెలిప్యాడ్ ను పరిశీలించారు. హెలిప్యాడ్ నుండి బ్యారేజి వరకు సరైన రోడ్డు సౌకర్యం ఉండాలన్నారు. అధికారులు, విఐపి లకు అనువైన పార్కింగ్ ను ఏర్పాటు చేయాలని చెప్పారు. త్రాగునీరు, మరుగుదొడ్లు, టెంట్, షామియానా, సరిపడినన్ని కుర్చీలు, తదితర వసతులు కల్పించాలని సూచించారు. అత్యవసర వైద్య బృందం సిద్ధంగా ఉంచాలన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేస్తూ, వారికి కేటాయించిన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి, ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయాలని పేర్కొన్నారు. సదర్మాట్ బ్యారేజి పరిసర ప్రాంతాల్లో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పోలీసు సిబ్బందికి, భద్రత ఏర్పాట్లపై కీలక సూచనలు చేశారు.
     ఈ పరిశీలనలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డిఓ రత్నకళ్యాణి, నీటిపారుదల శాఖ అధికారి అనిల్, డిపిఓ శ్రీనివాస్, జిల్లా ఎక్సైజ్ అధికారి ఎం.ఎ రజాక్, అగ్నిమాపక శాఖ అధికారి ప్రభాకర్, తహసిల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో సుశీల్ రెడ్డి, వివిధ విభాగాల ఇంజనీరింగ్ అధికారులు, పోలీసు శాఖల అధికారులు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

About The Author