నాణ్యత మరవద్దు.. పనులు త్వరగా ముగించాలి-బి.ఎన్. రెడ్డి నగర్ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి
పద్మావతి కాలనీలో సి.సి. రోడ్డు పనుల తనిఖీ.
బి.ఎన్. రెడ్డి నగర్:
రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించడంలో రాజీ పడకూడదని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులు త్వరగా పూర్తి చేయాలని కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన పద్మావతి కాలనీలో రూ. 22 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన సి.సి. రోడ్డు నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
క్యూరింగ్‌పై నిర్లక్ష్యం తగదు
నిర్మాణంలో ఉన్న రోడ్లను పరిశీలించిన కార్పొరేటర్‌కు కాలనీవాసులు పలు సమస్యలను విన్నవించారు. కాంట్రాక్టర్ కనీస నాణ్యత పాటించడం లేదని, ముఖ్యంగా రోడ్డు వేసిన తర్వాత చేయాల్సిన క్యూరింగ్ (నీటి తడుపు) ప్రక్రియను పూర్తిగా విస్మరించడం వల్ల రోడ్డు త్వరగా దెబ్బతినే అవకాశం ఉందని వారు ఫిర్యాదు చేశారు. స్థానిక అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పర్యవేక్షణ ఎక్కడ?
ఈ కార్యక్రమంలో పద్మావతి కాలనీ అధ్యక్షులు రాజు గౌడ్, నీళ్ల ఈశ్వరయ్య గౌడ్, ప్రకాశ్, ఉపేందర్, చందు, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
04 Mar 2026
