బాలెంల గ్రామాన్ని మోడ్రన్ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు కృషి
- నూతన సంవత్సరం బాలెంలలొ స్వచ్ఛ భారత్ ఏర్పాటు చేయడం అభినందనీయం
- తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి

సూర్యాపేట :
బాలెంల గ్రామాన్ని మోడ్రన్ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా బాలెంల గ్రామంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. సూర్యాపేట మండలంలోని బాలెంల గ్రామంలో సర్పంచ్ గాలి మమత నగేష్ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ పరిశుభ్రత కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. సర్పంచ్ గా ప్రమాణం స్వీకారం చేసిన మరుక్షణమే గాలి మమత నగేష్ పారిశుధ్యం, స్వచ్చత, వీధిలైట్ల ఏర్పాటులపైనే నా తొలి సంతకం చేస్తున్నట్టు తెలియజేయడం అందరికి తెలిసిన విషయమే.. దానిలో భాగంగానే దాతల సహకారంతో నిన్న బాలెంల స్టేజ్ నుండి ప్రైమరీ స్కూల్ వరకు వీధిలైట్స్ ఏర్పాటు చేశారు. అలాగే నేడు నూతన సంవత్సరంను పురస్కరించుకొని గ్రామంలో గల స్వచ్చత, పారిశుధ్యం సమస్యలను రూపుమాపడానికి ఈ స్వచ్చభారత్ కార్యక్రమం నిర్వహిస్తున్నారన్నారు. జాతీయ స్థాయిలో బాలెంలను మోడల్ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కావాల్సిన అన్ని సహాయసహకారాలు అందిస్తానని, ప్రజల్లో పారిశుధ్యం, స్వచ్ఛత అంశాలపై అవగాహన కల్పించి వీధి వీధికి డస్ట్ బిన్ లు ఏర్పాటు చేయించడానికి, అలాగే కోతుల సమస్యలను లేకుండా చేయడానికి, పాఠశాలలో 50 వేల రూపాయలతో అభివృద్ధి పనులను నేను, మా అన్నయ్య పటేల్ శ్రీధర్ రెడ్డి స్వంత నిధుల నుండి భరిస్తామన్నారు. ఈ సందర్బంగా గ్రామ ప్రజలకు, సర్పంచ్, వార్డ్ మెంబర్లకు ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసారు. వారితో పాటు ఈ కార్యక్రమంలో పటేల్ శ్రీధర్ రెడ్డి, బాలెంల గ్రామ కార్యదర్శి రాజు, డా. రామ్మూర్తి యాదవ్, గట్టు శ్రీనివాస్, షఫీ అలీ, భైరబోయిన శ్రీనివాస్, తండు శ్రీనివాస్ గౌడ్, యాట ఉపేందర్, మారపల్లి ప్రభాకర్, పటేల్ నర్సింహా రెడ్డి, గాలి నగేష్, మామిడి జంపయ్య, మామిడి తిరుమలయ్య, వార్డ్ మెంబర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..
