
ములుగు జిల్లా :
తెలంగాణ రాష్ట్ర మంత్రులు రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, స్త్రీ-శిశు సంక్షేమ శాఖల మంత్రిసీతక్క, ఎస్సీ, ఎస్టీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ లు నేడు బుధవారం మేడారాన్ని సందర్శించనున్నారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా మేడారం చేరుకుంటారు. మహాజాతర ఏర్పాట్లలో భాగంగా జరుగుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12గం.కు అధికారులతో సమీక్ష అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించి 2 గం.కు హెలికాప్టర్లో తిరుగు ప్రయాణమవుతారు.