ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి: జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్..
హైదరాబాద్:
ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, విన్నపాలను ఏమాత్రం జాప్యం చేయకుండా సత్వరమే పరిష్కరించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ అధికారులను ఆదేశించారు. సోమవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన స్వయంగా పాల్గొని బాధితుల నుంచి వినతులు స్వీకరించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహించకూడదని స్పష్టం చేశారు. ఒకే సమస్యపై అర్జీదారులు పదేపదే కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రాకూడదని, హెచ్‌ఓడీలు ప్రత్యేక శ్రద్ధ వహించి సమస్యలను పరిష్కరించాలని సూచించారు.
మొత్తం 168 ఫిర్యాదులు:
నగరవ్యాప్తంగా వివిధ జోన్ల పరిధిలో జరిగిన ప్రజావాణిలో మొత్తం 168 అర్జీలు అందాయి.
వీటి వివరాలు ఇలా ఉన్నాయి:
జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం: 41
శంషాబాద్ జోన్: 53
మల్కాజ్ గిరి జోన్: 32
కుత్బుల్లాపూర్ జోన్: 23
కూకట్‌పల్లి జోన్: 17
శేరిలింగంపల్లి జోన్: 11
ఎల్బీనగర్ జోన్: 08
రాజేంద్రనగర్ జోన్: 07
సికింద్రాబాద్ జోన్: 06
గోల్కొండ జోన్: 05
ఉప్పల్ జోన్: 04
చార్మినార్ జోన్: 02
ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్లు రఘు ప్రసాద్, సత్యనారాయణ, వేణు గోపాల్, అలివేలు మంగతాయారు, పంకజ, యూబీడీ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, సీసీపీ శ్రీనివాస్, చీఫ్ వాల్యుయేషన్ ఆఫీసర్ రజినీకాంత్ రెడ్డి, జాయింట్ కమిషనర్ తిప్పర్తి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
