పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది

- టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి 

WhatsApp Image 2025-11-12 at 6.08.23 PM

సంగారెడ్డి : 

Read More రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ – 2047 జూమ్ సమావేశం

రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి అన్నారు. బుధవారం కొండాపూర్ గొల్లపల్లి గ్రామాలలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను  ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం అలియాబాద్ లో రూపాయలు 20 లక్షలతో నూతనంగా నిర్మించనున్న పంచాయతీ భవన నిర్మాణానికి స్థానిక నాయకులతో కలిసి భూమి పూజ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రజా పాలనలో అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరుగుతుందన్నారు. గత పది ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. రైతులకు ఒకేసారి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ దేని అన్నారు. 6 గ్యారంటీలలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంతో పాటు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ 500 రూపాయలకే సిలిండర్ అందించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా ప్రతి ఇంటికి సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తుందన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పిఎసిఎస్ డైరెక్టర్లు రైతులు పాల్గొన్నారు. 

Read More టి జి ఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నమనేని జగన్ మోహన్ రావు ను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలి

About The Author